iDreamPost
android-app
ios-app

వివేక్ ఆత్రేయలో భారీ మార్పు! సరిపోదా శనివారం గ్లిమ్ప్స్ సాక్ష్యం!

  • Published Jul 20, 2024 | 5:46 PM Updated Updated Jul 20, 2024 | 5:46 PM

Saripodhaa Sanivaaram Not A Teaser- Big Change In Vivek Athreya: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ మూవీ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది. అది చూసిన తర్వాత వివేక్ ఆత్రేయ మారిపోయాడు అనే భావన తప్పకుండా కలుగుతుంది.

Saripodhaa Sanivaaram Not A Teaser- Big Change In Vivek Athreya: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ మూవీ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది. అది చూసిన తర్వాత వివేక్ ఆత్రేయ మారిపోయాడు అనే భావన తప్పకుండా కలుగుతుంది.

  • Published Jul 20, 2024 | 5:46 PMUpdated Jul 20, 2024 | 5:46 PM
వివేక్ ఆత్రేయలో భారీ మార్పు! సరిపోదా శనివారం గ్లిమ్ప్స్ సాక్ష్యం!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా అభిమానులు ముఖ్యంగా ఒక సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అది మరేదో కాదు.. వివేక్ ఆత్రేయ- న్యూచురల్ స్టార్ నాని కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం మూవీ. ఈ మూవీలో నాని క్యారెక్టర్ ఫుల్ మాసీగా ఉంటుందని అర్థమైపోయింది. అలాగే ఇందులో నాని తర్వాత బాగా ఎలివేట్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా ఉందా అంటే అది ఎస్ జే సూర్యదే అని చెప్పాలి. తాజాగా ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా ఒక నాటే టీజర్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత ఒక విషయం మాత్రం క్లారిటీ వచ్చేసింది. అదే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మారిపోయాడు అని.

వివేక్ ఆత్రేయ- నాని కాంబోలో వచ్చిన అంటే సుందరానికి సినిమా అందరికీ తెలుసు. ఆ మూవీకి మంచి అప్లాజ్ లభించింది. ఆ మూవీలో ఉండే స్క్రీన్ ప్లే, నాని యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. కానీ, అంత కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. దానికి ఉన్న ప్రధాన కారణం ఆ మూవీ మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడమే. నాని అంటే ఆడియన్స్ మినిమం మాస్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ, అంటే సుందరానికి మాత్రం పక్కా క్లాసీ టచ్ తో వెళ్లిపోయింది. అక్కడే ఆడియన్స్ కాస్త నిరుత్సాహ పడ్డారు. ఒక్క మాస్ డైలాగ్, ఒక్క మాసీ ఎలివేషన్ లేకపోవడం బాగా మైనస్ అయ్యింది. కానీ, ఆ లోటును ఈ సరిపోదా శనివారంతో తీర్చేస్తున్నాడు.

తాజాగా విడుదలైన సరిపోదా శనివారం నాటే టీజర్ వీడియో చూస్తే.. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆఫ్ మాసీ ఎలివేషన్స్ ఉన్నాయి. అటు ఎస్ జే సూర్య క్యారెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్స్ కావచ్చు.. నాని పాత్రను చూపించిన తీరు, ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా టాప్ నాచ్ గా ఉన్నాయి. మాసీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాతే వివేక్ ఆత్రేయ మారిపోయాడు అనే భావన కలుగుతోంది. న్యూచరల్ స్టార్ నానికి ఉన్న మాస్ ఫాలోయింగ్.. మాస్ సీన్స్ ఆయన చేయగలిగిన యాక్టింగ్ ఇలా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ సరిపోదా శనివారం తీసుకొస్తున్నాడు అనే విషయం అర్థమైపోతోంది. అభిమానులు ఇంక థియేటర్లలో మాస్ జాతర చేయడానికి రెడీ అయిపోండి. ఆగస్టు 29న సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అవుతోంది. మరి.. ఈ నాటే టీజర్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişdinamobet girişgrandpashabet