iDreamPost
android-app
ios-app

హిట్ డైరెక్టర్ కు.. న్యాచురల్ స్టార్ నాని షాకిస్తున్నాడా?

  • Published Mar 02, 2024 | 6:53 PM Updated Updated Mar 02, 2024 | 6:53 PM

Nani- Sialesh Kolanu: న్యాచురల్ స్టార్ నాని- శైలేష్ కొలను కాంబోలో హిట్ 3 సినిమా లైన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు.

Nani- Sialesh Kolanu: న్యాచురల్ స్టార్ నాని- శైలేష్ కొలను కాంబోలో హిట్ 3 సినిమా లైన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు.

  • Published Mar 02, 2024 | 6:53 PMUpdated Mar 02, 2024 | 6:53 PM
హిట్ డైరెక్టర్ కు.. న్యాచురల్ స్టార్ నాని షాకిస్తున్నాడా?

న్యాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ లో తనదైన సహజసిద్ధమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని పొందాడు. తను ఎంచుకునే కథలు, చేసే పాత్రలు ఎంతో కొత్తగా కొంత భిన్నంగా కూడా ఉంటాయి. శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి పాన్ ఇండియా లెవల్లో ఆడియన్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కెరీర్ లో వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోరు మీద ఉన్నాడు. ఇప్పటికే సరిపోదా శనివారం ఆగస్టు 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తర్వాతి సినిమాలు కూడా అంతే కొత్తగా ఉండేందుకు న్యాచురల్ స్టార్ నాని వ్యూహాలు రచిస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే హిట్ డైరెక్టర్ కు నాని షాకిచ్చాడు అంటున్నారు.

న్యాచురల్ స్టార్ నానికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సహజసిద్ధమైన నటనతో ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అద్భుతమైన పాత్రుల చేసిన నాని.. ఇప్పుడు సరిపోదా శనివారంలో కూడా తనదైన మార్క్ చూపించేందుకు రెడీ అయిపోయారు. అలాగే తర్వాత సుజీత్ తో సినిమా ఉంటుందని నాని పుట్టినరోజు సందర్భంగా డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ గ్యాంగ్ స్టర్, గ్యాంగ్ వార్ నే పథ్యంలో ఉంటుందని కాన్సెప్ట్ వీడియోలో చూపించారు. ఇప్పటికే సరిపోదా శనివారం కూడా కాస్త వైలెంట్ సినిమాగానే ఉంది.

నాని ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు, సినిమాలు చేయడు అని అందరికీ తెలిసిందే. అందుకే బలగం వేణుతో దసరా కథను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేణు పలుసార్లు నానీని కలిసి స్టోరీ డిస్కషన్స్ చేశాడు. నాని కూడా కథలో కొన్ని మార్పులు చెప్పడం, ఇంకాస్త డెవలప్ చేయమని చెప్పాడు అంటున్నారు. ప్రస్తుతం వేణు ఈ పనిలో పడ్డాడు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హిట్ డైరెక్టర్ శైలేష్ కొలనుకు హీరో నాని షాకిచ్చాడు అంటున్నారు. నిజానికి ఈ సమ్మర్ కే హిట్ థర్డ్ కేస్ పట్టాలెక్కాల్సింది. కానీ, ఇంకా నాని ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటున్నారు. హిట్ 2 చిత్రంలోనే నాని క్యారెక్టర్ కు సంబంధించి చిన్న ఇంట్రో సీన్ కూడా క్లైమ్యాక్స్ లో చూపించారు. అర్జున్ సర్కార్ అనే పాత్రలో నాని కనిపించబోతున్నాడు.

హిట్ 3 మూవీపై ఇటీవల శైలేష్ కొలను తెరకెక్కించిన సైంధవ్ సినిమా ఫలింత ఎఫెక్ట్ పడింది అంటున్నారు. సైంధవ్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ విషయంలోనే నాని కాస్త ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. పైగా హిట్ 3 సినిమా కథ కూడా నానికి అంత గ్రిప్పింగ్ గా అనిపిచంలేదని.. కథలో కూడా మార్పులు చేయాల్సిందిగా చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అందుకే ఇంకా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు అంటున్నారు. అయితే ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతానికి శైలేష్ కొలను కూడా డైలమా ఉన్నాడని చెప్తున్నారు. మరి.. శైలేష్ కొలనుకు న్యాచురల్ స్టార్ నాని షాకిచ్చాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş