iDreamPost
android-app
ios-app

న్యాచురల్ స్టార్ నాని ఎమోషనల్ పోస్ట్.. గుండె బరువెక్కింది అంటూ..

Natural Star Nani Emotional: న్యాచురల్ స్టార్ నాని దంపతులు ఎమోషనల్ అయ్యారు. గుండె బరువెక్కింది అంటూ నాని చేసిన కామెంట్స్ చూసి ఆడియన్స్, ఫ్యాన్స్ కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.

Natural Star Nani Emotional: న్యాచురల్ స్టార్ నాని దంపతులు ఎమోషనల్ అయ్యారు. గుండె బరువెక్కింది అంటూ నాని చేసిన కామెంట్స్ చూసి ఆడియన్స్, ఫ్యాన్స్ కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.

న్యాచురల్ స్టార్ నాని ఎమోషనల్ పోస్ట్.. గుండె బరువెక్కింది అంటూ..

టాలీవుడ్ లో కష్టపడి టాలెంట్ ని నమ్ముకుని ఎదిగిన ఎంతో మంది హీరోల్లో న్యూచురల్ స్టార్ నాని కూడా ఒకడు. డైరెక్టర్ కావాలని కలలు కని.. అనుకోకుండా హీరోగా మారిపోయిన ఈ బోర్న్ ఆర్టిస్ట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమాని ఒక ప్రయోగంగా.. విభిన్నమైన పాత్రలు, కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు. ఈ స్టార్ ఎంచుకునే కథలకు ప్రేక్షకులు ఫిదా అయిపోతూనే ఉన్నారు. రాబోయే సినిమాలను కూడా నాని అలాగే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే తాజాగా నాని ఎంతో ఎమోషనల్ అయ్యాడు. తాను సోషల్ మీడియాలో గుండె బరువెక్కుతోంది అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్, ఫ్యాన్స్ కి బాగా దగ్గరైన కథలు అంటే.. కచ్చితంగా జెర్సీ సినిమా ఉంటుంది. ఈ మూవీ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. నానీకి కూడా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ క్రేజీ స్పోర్ట్స్ డ్రామా విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సుదర్శన్ థియేటర్ లో జెర్సీ స్పెషల్ షో వేశారు. ఈ షోకి నాని- అంజనా దంపతులు హాజరయ్యారు. అభిమానులతో కలిసి మరోసారి ఈ అద్భుతమైన మూవీ చూడటంతో నాని దంపతులు ఎమోషనల్ అయ్యారు. వారు చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

“ఇవాళ నేనెంతో భావోద్వైగానికి గురవుతున్నాను. అభిమానులు చూపిస్తున్న ఈ ఆదరణ చూస్తుంటే మళ్లీ తన ప్రయాణాన్ని ఆశ్వాదించడానికి అర్జున్(జెర్సీ క్యారెక్టర్ పేరు) మరోసారీ భూమి మీదకు వచ్చినట్లు అనిపిస్తోంది. అభిమానుల ప్రేమానురాగాలు చూస్తుంటే గుండె బరువెక్కంది. మనసు నిండిపోయింది” అంటూ నాని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అలాగే అంజనా కూడా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అయ్యింది. “థియేటర్లో తొలిసారి జెర్సీ సినిమా చూసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ సీన్స్ నన్ను ఇప్పటికీ ఎమోషనల్ చేస్తాయి. మా అబ్బాయి అర్జున్ ఇప్పుడిప్పుడే పియానోపై జెర్సీ థీమ్ సాంగ్ ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు” అంటూ అంజనా రాసుకొచ్చింది. మొత్తానికి జెర్సీ సినిమా చూసి వీళ్లు ఎమోషనల్ అవ్వడమే కాకుండా.. వారి మాటలతో ఆడియన్స్ ని ఎమోషనల్ చేసేశారు. వారి మాటలకు అభిమానులు, జెర్సీ ఫ్యాన్స్ గుండెలు కూడా బరువెక్కాయి. నెక్ట్స్ నాని సరిపోదా శనివారం మూవీతో ఆడియన్స్ ని అలరించడానికి వస్తున్నాడు. మరి.. నాని దంపతులు ఎమోషనల్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nani Fans Association (@nfa_hyd)

Jojobet GirişmeritbetmarsbahisCasibomcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş