iDreamPost
android-app
ios-app

డైరెక్టర్ జీతూ జోసెఫ్ తో హీరో నాని నెక్ట్స్ మూవీ? మంచి క్రైమ్ థ్రిల్లర్ గా..!

  • Published Aug 25, 2024 | 12:38 PM Updated Updated Aug 25, 2024 | 12:38 PM

Hero Nani Is Planning A Movie With Director Jeethu Joseph: న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా సినిమా సరిపోదా శనివారం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే తన తర్వాత ప్రాజెక్ట్ కూడా ఒక క్రేజీ డైరెక్టర్ తో నాని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Hero Nani Is Planning A Movie With Director Jeethu Joseph: న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా సినిమా సరిపోదా శనివారం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే తన తర్వాత ప్రాజెక్ట్ కూడా ఒక క్రేజీ డైరెక్టర్ తో నాని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • Published Aug 25, 2024 | 12:38 PMUpdated Aug 25, 2024 | 12:38 PM
డైరెక్టర్ జీతూ జోసెఫ్ తో హీరో నాని నెక్ట్స్ మూవీ? మంచి క్రైమ్ థ్రిల్లర్ గా..!

న్యూచరల్ స్టార్ నాని.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో బాగా వైరల్ అవుతున్న పేరు. అలాగే నాని నుంచి వస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా కూడా జోరుగా ప్రమోషన్స్ చేస్తూ ఆడియన్స్ లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. తాజాగా శరిపోదా శనివారం టీమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. ఆగస్టు 29న ప్రేక్షకులు ముందుకు వస్తున్న నేపథ్యంలో.. సరిపోదా శనివారం సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే ఆన్ లైన్ లో ఈ మూవీకి జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు హీరో నానికి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిందిం. అదేంటంటే.. ఒక క్రేజీ డైరెక్టర్ తో నెక్ట్స్ మూవీని ప్లాన్ చేస్తున్నారు అని చెబుతున్నారు. ఇప్పటికే కథ కూడా ఓకే అయ్యింది అని వార్తలు వస్తున్నాయి.

న్యాచురల్ స్టార్ నాని ఇటీవల చాలాసార్లు ఒక మాటను పదే పదే చెప్పాడు. తాను ఎప్పుడూ కూడా ఆడియన్స్ ని మెప్పించే విధంగానే కథలను ఎంచుకుంటానని.. వారిని ఎప్పుడూ నిరాశ చెందేలా చేయను అని చెప్పాడు. అలాగే ప్రతి సినిమానికి ఒక మెట్టు ఎక్కే విధంగానే తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటానని చెప్పాడు. ఆ మాటలను అక్షరాల నిజం చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నాని ఇప్పటి వరకు తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు. అలాగే సరిపోదా శనివారం సినిమా కూడా అంచనాలను రెట్టింపు చేసే విధంగానే ఉంది. తన తర్వాతి ప్రాజెక్ట్ కూడా ఇదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు అంటున్నారు. క్రేజీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ తో హీరో నాని తర్వాతి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అంటున్నారు.

nani next movie with crazy director

జీతూ జోసెఫ్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనకు దృశ్యంలాంటి చిత్రాలతో తెలుగులో కూడా అభిమానులు పెరిగిపోయారు. ఒక క్రైమ్ కథా చిత్రాన్ని చెప్పడంలో జీతూ జోసెఫ్ కు స్పెషల్ టాలెంట్ ఉందనే చెప్పాలి. మొదటి నుంచి ఆయనకు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ డైరెక్టర్ అని ముద్ర పడిపోయింది. ఇప్పుడు నానితో కూడా అలాంటి ఒక క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నాడు అని చెబుతున్నారు. ఇప్పటికే కథ కూడా రెడీ చేసుకున్నారని.. నానికి కూడా చెప్పారు అంటూ చాలానే వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. వీటిలో నిజం ఎంతుందో తెలియాలి అంటే సరిపోదా శనివారం రిలీజ్ అయ్యాక కూడా కొన్నిరోజులు ఆగాల్సి ఉంటుంది. జీతూ జోసెఫ్ తో నాని సినిమా అనే వార్తలు ఏడాది క్రితం నుంచే ఉన్నాయి. కాబట్టి ఇవి నిజం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి.. హీరో నాని- జీతూ జోసెఫ్ కాంబోలో మూవీ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetslotday girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom