iDreamPost
android-app
ios-app

Trivikram: త్రివిక్రమ్ ప్లాన్ B రెడీ! బన్నీతో కాదు.. ఆ ఇద్దరు హీరోలతోనే..!

  • Published Jan 28, 2024 | 2:40 PM Updated Updated Jan 28, 2024 | 2:40 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తర్వాతి ప్రాజెక్టుకు సంబంధించి ప్లాన్ బీని రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తర్వాతి ప్రాజెక్టుకు సంబంధించి ప్లాన్ బీని రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

  • Published Jan 28, 2024 | 2:40 PMUpdated Jan 28, 2024 | 2:40 PM
Trivikram: త్రివిక్రమ్ ప్లాన్ B రెడీ! బన్నీతో కాదు.. ఆ ఇద్దరు హీరోలతోనే..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి, ఆయన టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు సరైన కథను రెడీ చేసుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాల్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తున్నాడు. అయితే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే త్రివిక్రమ్ కు బోయపాటి, అట్లీ రూపంలో గట్టి పోటీనే ఉంది. ఇప్పటికే బోయపాటి- గీతా ఆర్ట్స్ కాంబోలో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాకి అల్లు అర్జున్ బెస్ట్ ఆప్షన్ అనుకున్నాడు. అందుకే పుష్ప 2 సినిమా పూర్తయ్యే వరకు వెయిట్ కూడా చేస్తున్నాడు. కానీ, బోయపాటి, అట్లీ రూపంలో త్రివిక్రమ్ కు గట్టి పోటీ ఉంది. బోయపాటితో గీతా ఆర్ట్స్ అనౌన్స్ చేసిన ప్రాజెక్టుకు హీరోని అనౌన్స్ చేయలేదు. నిజానికి ఆ ప్రాజెక్ట్ బన్నీ కోసం అని ఇప్పటికే టాలీవుడ్ లో గట్టి టాక్ నడుస్తోంది. కానీ, ఎవరు బెస్ట్ స్టోరీతో వస్తే వారికే ఓకే చెప్తాడు అంటూ చెబుతున్నారు. అందుకే ఇంకా త్రివిక్రమ్, బోయపాటి, అట్లీ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. అందుకే త్రివిక్రమ్ కూడా తన సొంత ప్లాన్స్ లో ఉన్నాడని చెబుతున్నారు.

triviktam hav plan b

ఇప్పటికే త్రివిక్రమ్ ప్లాన్ బీ కూడా రెడీ చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఒక మంచి మల్టీ స్టాటరర్ తీసేందుకు కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. న్యాచురల్ స్టార్ నాని, విక్టరీ వెంకటేశ్ తో ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నాడట. అందుకు ఇప్పటికే నాని ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. వెంకటేశ్ మాత్రం కాస్త తటపటాయిస్తున్నాడు అంటున్నారు. ఒకవేళ వెంకటేశ్ ఓకే చెప్పకపోయినా ఆ ప్లేస్ లో మరో హీరోని తీసుకోవడానికి కూడా త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మల్టీ స్టారర్ మాత్రమే కాకుండా.. రామ్ పోతినేనితో కూడా ఒక సినిమాకి రెడీ అవుతున్నాడట. అయితే రామ్ తో సినిమా కంటే కూడా మల్టీ స్టారర్ అయితేనే బెటర్ ఆప్షన్ గా భావిస్తున్నాడు. అందుకే మల్టీ స్టారర్ కే ఓటేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అసలు త్రివిక్రమ్ ఎందుకు బన్నీ నిర్ణయం కోసం వెయిట్ చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు అల్లు అర్జున్ మనసులో ఏముందో త్రివిక్రమే ఇట్టే కనిపెట్టేయగలడని.. అందుకే బన్నీ నిర్ణయాన్ని ముందే కనిపెట్టిన మాటల మాంత్రికుడు ఈ మల్టీ స్టారర్ తో తన ప్లాన్ బీని సిద్ధం చేసుకున్నాడు అంటున్నారు. ఇంక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. పుష్ప 2 ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఆడియన్స్ మాత్రమే కాకుండా.. స్టార్ డైరెక్టర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 వాయిదా పడబోతోంది అంటూ గట్టిగానే వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన తేదీకే విడుదల చేసేందుకే సినిమా టీమ్ రెడీ అవుతోందంట. మరి.. త్రివిక్రమ్ మల్టీస్టారర్ చేసుకోవడమే బెటరా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom