iDreamPost
android-app
ios-app

కల్కి 2898 ADలో కృష్ణుడిగా చేసింది నాని కాదు.. అతను ఎవరంటే?

Star Hero Who Played Krishna Role In Kalki 2898 AD Movie: కల్కి 2898 ఏడీ మూవీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీలో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ, కృష్ణుడి పాత్రను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆ పాత్రలో ఎవరు యాక్ట్ చేశారో మీకు తెలుసా?

Star Hero Who Played Krishna Role In Kalki 2898 AD Movie: కల్కి 2898 ఏడీ మూవీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీలో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ, కృష్ణుడి పాత్రను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆ పాత్రలో ఎవరు యాక్ట్ చేశారో మీకు తెలుసా?

కల్కి 2898 ADలో కృష్ణుడిగా చేసింది నాని కాదు.. అతను ఎవరంటే?

కల్కి 2898 ఏడీ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపోయింది. సూపర్ పాజిటివ్ టాక్ తో సినిమా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ నుంచి మంచి అప్లాజ్ లభిస్తోంది. సినిమా మాత్రం హాలీవుడ్ రేంజ్ అంటూ పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినీ లవర్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు. ఇది జస్ట్ మూవీ కాదు.. ఒక అద్భుతం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే ఇది కేవలం మొదటి పార్ట్ మాత్రమే. రెండో పార్ట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. అప్పటి కోసం నాగ్ అశ్విన్ కొన్ని కొన్ని విషయాలను దాచి ఉంచాడు. వాటిలో కృష్ణుడి పాత్ర కూడా ఒకటి. అయితే ఆ పాత్రను మాత్రం నాగ్ అశ్విన్ రివీల్ చేయలేదు.

కల్కి సినిమాకి సంబంధించి కథ అందరికీ తెలిసిందే. సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చిత్ర బృందం ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. అయితే నాగ్ అశ్విన్ టేకింగ్, కథ చెప్పిన విధానానికి మీరు ఫిదా అయిపోతారు. సినిమాలో ఒక్కో సీన్ ఒక రేంజ్ లో ఉంది. ముఖ్యంగా అశ్వత్థామ- భైరవ యాక్షన్ సీక్వెన్స్ కి మీరు చప్పట్లు కొట్టేస్తారు. ఇంక లాస్ట్ 15 నిమిషాలు అయితే థియేటర్ మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేస్తుంది. ఈ సినిమాలో అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. వాటిలో కృష్ణుడి ఎంట్రీ కూడా ఒకటి. కృష్ణుడి వచ్చినప్పుడల్లా థియేటర్ దద్దరిల్లి పోతుంది. అయితే కృష్ణుడిని మాత్రం రివీల్ చేయలేదు.

Krishna in Kalki movie

నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా ఈ మూవీలో చాలానే క్యామియో అప్పియరెన్సులు ఉన్నాయి. వాటిలో ఆర్జీవీ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ పాత్రల గురించి ఎప్పటి నుంచో బజ్ ఉంది. వాళ్లు సినిమాలో ఉన్నారు అనే విషయాన్ని మూవీ టీమ్ కూడా కన్ఫామ్ చేసింది. అలాగే సిల్వర్ స్క్రీన్ మీద వారిని చూసి మెస్మరైజ్ అయిపోతారు. ఇప్పుడు ఈ సినిమాలో ఇంకో క్యామియో ఏదైనా ఉంది అంటే అది కృష్ణుడి పాత్ర అనే చెప్పాలి. ఆ పాత్రను మాత్రం రివీల్ చేయలేదు. కేవలం వాయిస్ వినిపిస్తుంది. మనిషి కనిపిస్తాడు. కానీ, ముఖం మాత్రం రివీల్ చేయరు. అతను మరెవరో కాదు.. న్యాచురల్ స్టార్ నాని అంటు ఎప్పటి నుంచో టాక్ ఉంది. స్క్రీన్ మీద చూసిన తర్వాత అది నిజమే అని.. కృష్ణుడిగా చేసింది నాని అని చాలామంది భావిస్తున్నారు. అలాగే ట్విట్టర్లో కూడా పోస్టులు పెడుతున్నారు.

అయితే కల్కి సినిమాలో కృష్ణుడిగా చేసింది నాని కాదు. ఆ పాత్ర చేసింది కృష్ణకుమార్ అలియాస్ కేకే. ఇతను యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా. తానే ఈ రోల్ చేసినట్లు తన ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టాడు. కృష్ణుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది మాత్రం అర్జున్ దాస్. ఈ విషయాలను ఇన్ స్టాలో వచ్చే పోస్టులను తాను షేర్ చేస్తూ కన్ఫామ్ చేశాడు. ఫేస్ రివీల్ చేయకపోవడంతో ఇంకో కొత్త వాదన కూడా వస్తోంది. అదేంటంటే.. రెండో పార్ట్ లో కృష్ణుడి పాత్రలో మహేశ్ బాబును చూపిస్తారు అని.. ఈ మూవీ మల్టీ స్టారర్ అవుతుంది అనే వాదన కూడా ఉంది. అందుకే కృష్ణుడిని రివీల్ చేయకుండా హైడ్ చేశారు అంటున్నారు. అయితే రెండో పార్ట్ లో కృష్ణుడిగా ఎవరైనా స్టార్ హీరోని పెడతారా? అనే విషయంపై మాత్రం ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రెండో పార్ట్ రావాలి అంటే కనీసం ఇంకో సంవత్సరం అన్నా సమయం పడుతుంది. ఈలోపు సినిమాలో ఏమైనా జరగచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఆ కృష్ణుడి పాత్ర చేసింది కృష్ణ కుమార్ అని క్లారిటీ వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)