iDreamPost
android-app
ios-app

ఆన్ లైన్ లో ‘సరిపోదా శనివారం’ PVR- Inox టికెట్స్ మాయం! ఏం జరిగిందంటే?

  • Published Aug 28, 2024 | 4:08 PM Updated Updated Aug 28, 2024 | 4:08 PM

Saripodaa Sanivaaram PVR And Inox Tickets Issue: న్యాచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. టికెట్స్ కూడా ఫాస్ట్ గా బుక్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో సినిమాకి చిన్న సమస్య వచ్చింది.

Saripodaa Sanivaaram PVR And Inox Tickets Issue: న్యాచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. టికెట్స్ కూడా ఫాస్ట్ గా బుక్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో సినిమాకి చిన్న సమస్య వచ్చింది.

  • Published Aug 28, 2024 | 4:08 PMUpdated Aug 28, 2024 | 4:08 PM
ఆన్ లైన్ లో ‘సరిపోదా శనివారం’ PVR- Inox టికెట్స్ మాయం! ఏం జరిగిందంటే?

పోతారు.. మొత్తం పోతారు.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ- ఎస్జే సూర్య కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఒక మంచి సినిమాతో వస్తున్నాం అని మూవీ టీమ్ అయితే ప్రేక్షకుల్లో నమ్మకాన్ని నింపింది. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తాం అని అయితే టీమ్ భరోసా కలిగిస్తోంది. ఇప్పటికే సరిపోదా శనివారం సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. టికెస్ట్ కూడా ఫాస్ట్ గా అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి తరుణంలో సరిపోదా శనివారం ఫ్యాన్స్ కి బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది. పీవీఆర్- ఐనాక్స్ టికెట్స్ కనిపించడం లేదు.

సరిపోదా శనివారం సినిమా టికెట్స్ ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. దాదాపుగా మార్నింగ్ షోస్ అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడిపోతున్నాయి. అయితే బుక్ మై షోలో ఎక్కడా కూడా పీవీఆర్- ఐనాక్స్ కి సంబంధించిన టికెట్స్ మాత్రం కనిపించడం లేదు. బుక్ మై షోలో ఆ థియేటర్స్ కి సంబంధించిన టికెట్స్ ఎందుకు లేవు అని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకు కారణం ఏవో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ వల్ల పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ ఛైన్స్ కి సంబంధించిన టికెట్స్ ని తొలగించారు అంటున్నారు. మరి.. ఈ సమస్య ఎన్ని గంటలు ఉంటుంది? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కానీ, అతి త్వరలోనే ఈ సమస్య తీరిపోవాలని నాని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇంక సరిపోదా శనివారం సినిమా విషయానికి వస్తే.. హీరో నాని సినిమా చూసేశాడు. తాను సినిమా చూసిన విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ‘నా షో అయిపోయింది.. రేపు మీ షో చూడండి’ అంటూ నాని చెప్పుకొచ్చాడు. ఇంక సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత అవి రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా వివేక్ ఆత్రేయ.. హీరో నానిని చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. నానిని క్లాస్ టచ్ తో.. ఇంత మాస్ గా ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు చూడలేదు. కావాల్సినన్ని ఎలివేషన్స్, క్వాలిటీస్, కోపంతో క్యారెక్టర్ ని బిల్డ్ చేసిన విధానం సగటు ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమా రేపు (ఆగస్టు 29) థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి.. సరిపోదా శనివారం టికెట్స్ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio