iDreamPost
android-app
ios-app

సరిపోదా శనివారం ట్రైలర్ రివ్యూ.. ‘ఊర మాస్’ అనే మాట కూడా తక్కువేనేమో?

  • Published Aug 13, 2024 | 8:31 PM Updated Updated Aug 13, 2024 | 8:31 PM

Saripodhaa Sanivaaram Movie Trailer Review In Telugu: న్యాచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయా- ఎస్జే సూర్యా కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేశారు. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

Saripodhaa Sanivaaram Movie Trailer Review In Telugu: న్యాచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయా- ఎస్జే సూర్యా కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేశారు. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

  • Published Aug 13, 2024 | 8:31 PMUpdated Aug 13, 2024 | 8:31 PM
సరిపోదా శనివారం ట్రైలర్ రివ్యూ.. ‘ఊర మాస్’ అనే మాట కూడా తక్కువేనేమో?

న్యాచురల్ స్టార్ నాని టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ‘దసరా’ లాంటి మాస్ హిట్ తరువాత ‘హాయ్ నాన్న’ లాంటి క్లాస్ మూవీతో కూడా హిట్ కొట్టి తానేంటో మళ్ళీ నిరూపించుకున్నడు. ప్రస్తుతం యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో ‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. గతంలో వీరి కలయికలో “అంటే సుందరానికీ” సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకున్నా కానీ లాంగ్ రన్ లో మాత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. దాంతో నానితో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈసారి సరిపోదా శనివారం లాంటి మాస్ కంటెంట్ తో వస్తున్నాడు.

ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ఆకట్టుకుంటోంది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే సినిమాపై హైప్ పెరగగా ఇప్పుడు ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అంటే సుందరానికి వీళ్లిద్దర కాంబో మరీ క్లాస్ గా సాగింది. ఈసారి మాత్రం మాస్ కూడా ఊర మాస్ అంటూ కామెంట్ చేసేలా నానిని వివేక్ ఆత్రేయా చూపించాడు. ఇందులో ఎస్జే సూర్యా కూడా బిగ్గెస్ట్ అసెట్ అనే చెప్పాలి. ఒక పోలీస్ ఆఫీసర్ గా నానిని ఢీకొట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక్క ఎస్జే సూర్యానే కాకుండా.. ఇందులో ఇంకా చాలామంది విలన్స్ ఉన్నారు అని అర్థమవుతోంది. అలాగే హీరో ఒకసారి ఒకరి పేరు రౌండ్ చేశాడు అంటే.. వాళ్లకు రౌండ్ ట్రాలీ అని ఫిక్స్ అయిపోవాల్సిందే.

ఒక హీరోని ఎంత పవర్ ఫుల్ గా చూపించాలో, ఎంత మాసీగా చూపించాలో, ఎంత కోపధారిగా చూపించాలో అంతగా వివేక్ చూపించేశాడు. ఇప్పటికే సినిమా టైటిల్ వెనుక ఉన్న స్టోరీ ఏంటో అందరికీ తెలుసు. ఎస్జే సూర్య పుణ్యమా అని ఆ విషయం అయితే క్లారిటీ వచ్చింది. ఇంక థియేటర్లో బొమ్మ ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే విషయం మాత్రం ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. దసరా సినిమాలో కేవలం మాస్ గానే నాని కనిపించాడు. కానీ, ఈ మూవీలో మాత్రం క్లాస్ ని మాస్ ని మిక్స్ చేసి కొత్త నానిని చూపించారు. ఈ సరిపోదా శనివారం సినిమాలో నాని సరసన తమిళ హీరోయిన్ ప్రియాంక మోహన్ నటిస్తోంది. గతంలో వీరి కాంబినేషన్లో గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో వీరి జంట అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు అదే మ్యాజిక్ మరోసారి సరిపోదా శనివారంలో కూడా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 29వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. మరి.. సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet