న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన “అంటే సుందరానికీ” సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్ గా నిలిచి హిట్ కొట్టింది. ఈ సినిమాని వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక ఇక్కడ కలెక్షన్స్ లో పర్వాలేదనిపించినా యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూలు చేస్తుంది అంటే సుందరానికి సినిమా. మన తెలుగు సినిమాకి దేశం బయట అమెరికా మంచి మార్కెట్. మన ప్రతి […]
నాని నటించిన “అంటే సుందరానికి” సినిమాపై అందరూ చెప్తున్న ప్రధాన కంప్లైంట్ ఒక్కటే.. అదే సినిమా రన్ టైమ్. సినిమాను సాగదీశారు అంటూ దాదాపు పదిమంది ప్రేక్షకుల్లో 7-8 మంది ప్రేక్షకులు చెప్తున్నారు. దీనిపై దర్శకుడు వివేక్ ఆత్రేయ తాజాగా స్పందించారు. సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ వేదికగా వివేక్ ఈ అంశంపై మాట్లాడారు. రన్ టైమ్ ను తగ్గించే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఇంత నిడివిలోనే చెప్పాలని బృందమంతా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. […]
అడవి శేష్ కెరీర్లోనే మేజర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం కలెక్షన్లు నెమ్మదించినా ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 కోట్లు దాటేయడంతో ఫైనల్ గా సూపర్ హిట్ స్టేటస్ సాధించుకుంది. దేశభక్తి ప్రధానాంశంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా దర్శకుడు శశికిరణ్ తిక్క రూపొందించిన ఈ పాట్రియాటిక్ డ్రామాకు పవన్ కళ్యాణ్, చిరంజీవిలు మద్దతు తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిర్మాత మహేష్ బాబు వీటిని రీ ట్వీట్ చేయడం ద్వారా తన సంతోషాన్ని […]
నాని హీరోగా, నజ్రియా నజీమ్ హీరోయిన్ గా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంటే సుందరానికి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలని పెంచారు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఉండబోతుందని తెలుస్తుంది. రెండు వేరు వేరు మతాల వాళ్ళు ప్రేమించుకుంటే దాన్ని సీరియస్ గా కాకుండా కామెడీ రూపంలో చూపించే కొత్త ప్రయత్నం చేసాడు దర్శకుడు వివేక్. అలాగే నజ్రియా తొలిసారి తెలుగులో […]
తెలుగు, తమిళ సినిమాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీని గత కొంత కాలంగా ప్రేమించి ఇటీవల నిశితార్థం చేసుకున్నారు. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఈ నిశితార్థం జరిగింది. తాజాగా మే 18న రాత్రికి చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో వీరి పెళ్లి జరగనుంది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్ళికి వారి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు సినీ ప్రముఖులు […]
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి జూన్ 10న విడుదల కాబోతోంది. ఇవాళ ఏఎంబి మాల్ వేదికగా టీజర్ లాంచ్ ని గ్రాండ్ గా చేశారు. నిడివి మాత్రం ట్రైలర్ అంత ఉంది. అంటే మరొకటి వచ్చే నెల వదులుతారేమో చూడాలి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురాతో ప్రేక్షకుల మెప్పు పొందిన వివేక్ ఆత్రేయ టేకింగ్ మీద హోమ్ ఆడియన్స్ లో మంచి గురి ఉంది. అందులోనూ నాని మూవీ కావడంతో […]
టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల జాతర జరుగుతోంది. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాక ఒక్కొక్కరు రెండేసి తేదీలను ప్రకటించేస్తున్నారు. రాజమౌళి ఈ ట్రెండ్ ని మొదలుపెట్టగా ఇప్పుడు అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు. భీమ్లా నాయక్, గని, రామారావు ఆన్ డ్యూటీ ఆల్రెడీ ఆ పని చేసేయగా నాని కొత్త సినిమా అంటే సుందరానికి ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా 7 డేట్లను అనౌన్స్ చేసి ఈ ట్రెండ్ మీద గట్టి సెటైర్ వేసింది. […]
కరోనా లాక్ డౌన్ ల వల్ల సినిమా రిలీజులు షూటింగులు ఎంతగా ప్రభావితం చెందుతున్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాదాపు అగ్ర హీరోలందరూ తమ షూట్లకు బ్రేక్ ఇచ్చేశారు. ఒకరిద్దరు ధైర్యంగా చేస్తున్నారు కానీ యూనిట్ లో ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా చాలు మొత్తం ఆగిపోతుంది. థియేటర్లకు జనం వస్తున్నా సరే నిర్మాతలు కొత్త విడుదల తేదీలను ప్రకటించలేకపోతున్నారు. ఈ విషయంలో న్యాచురల్ స్టార్ నానిని మెచ్చుకోవచ్చు. చిత్రీకరణను అనుకున్న టైంలో పూర్తి చేసేందుకు పక్కా ప్లానింగ్ […]
కొత్త శుక్రవారానికి థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కానీ ఓటిటిలో మాత్రం రేపు బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఉన్నాయి. కోరుకున్న వాళ్లకు కోరుకున్నంత అనే స్థాయిలో మూవీస్, వెబ్ సిరీస్ గట్టిగానే సందడి చేయబోతున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సిన వాటిలో ‘శ్యామ్ సింగ రాయ్’ ఇవాళ అర్ధరాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో రానుంది. హోమ్ ఆడియన్స్ గట్టిగానే ఉన్నారు కాబట్టి వ్యూస్ భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మోస్ట్ వాంటెడ్ రిలీజ్ అఫ్ ది సీజన్ […]