iDreamPost
android-app
ios-app

దసరా దర్శకుడితో నాని సినిమా.. ఈసారి మామూలుగా ఉండదట!

  • Published Nov 27, 2023 | 5:22 PM Updated Updated Nov 27, 2023 | 5:22 PM

నాని కొత్త దర్శకుడు ‘శ్రీకాంత్‌ ఓదెల’ను నమ్మి ఓ భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. దసరా సినిమా ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసింది...

నాని కొత్త దర్శకుడు ‘శ్రీకాంత్‌ ఓదెల’ను నమ్మి ఓ భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. దసరా సినిమా ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసింది...

  • Published Nov 27, 2023 | 5:22 PMUpdated Nov 27, 2023 | 5:22 PM
దసరా దర్శకుడితో నాని సినిమా.. ఈసారి మామూలుగా ఉండదట!

తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త దర్శకుల్ని ప్రొత్సహించే అతి కొద్ది మంది స్టార్‌ హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటారు. కొత్త దర్శకులను నమ్మి వారికి అవకాశం ఇవ్వటం ఒక ఎత్తయితే.. వారినుంచి  మంచి ఫలితాలను రాబట్టం మరో ఎత్తు. కెరీర్‌ తొలినాళ్ల నుంచి నాని ఇదే ఫాలో అవుతున్నారు. ఈ సంవత్సరం ‘దసరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి ‘శ్రీకాంత్‌ ఓదెల’ దర్శకత్వం వహించారు. ఇది శ్రీకాంత్‌ మొదటి సినిమా. డెబ్యూటెంట్‌ను నమ్మి నాని ఓ పెద్ద ప్రాజెక్టుకు ఓకే చెప్పారు.

ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో దసరా రిలీజైంది. దేశ వ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా శ్రీకాంత్‌ ఓదెలకు ఇండస్ట్రీలో మంచి  పేరు వచ్చింది. ఇక, ఈ నేపథ్యంలో ఆయన తర్వాతి సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. తర్వాత ఏ స్టార్‌ హీరోతో సినిమా చేయబోతున్నాడా? అని ఆలోచిస్తూ ఉన్నారు. శ్రీకాంత్‌ తన తర్వాతి సినిమాపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. తన తర్వాతి చిత్రం కూడా న్యాచురల్‌ స్టార్‌ నానితోటే ఉండనున్నట్లు వెల్లడించారు.

దీంతో నాని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరో ఖాతాలో మరో హిట్టు ఖాయం అంటున్నారు. ఇక, వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ రెండో సినిమా ఎలా ఉండబోతోందో తెలియరాలేదు. ఈ చిత్రం దసరా స్టైల్లోనే మాస్‌గా ఉండబోతుందా? లేక క్లాస్‌గానా అన్నది తెలియాల్సి ఉంది. కాగా, నాని వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘ హాయ్‌ నాన్న’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. డిసెంబర్‌ 7వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీలో నాని సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం నాని దర్శకుడు వివేక్‌తో కలిసి ‘ సరిపోదా శనివారం’  చేస్తున్నారు. ఈ మూవీ శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచేసింది. వచ్చే ఏడాది ‘సరిపోదా శనివారం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో సందడి చేయనుంది.

 ఈ మూవీ తర్వాత నాని ప్రముఖ తమిళ దర్శకుడు .. డాన్‌ ఫేమ్‌ ‘శిబి చక్రవర్తి’తో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత హిట్టు ఫ్రాంచైజీలో రానున్న హిట్‌ 3 సినిమాలో నటించనున్నారు. హిట్‌ 3కి శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తారు. వీటి తర్వాతే శ్రీకాంత్‌ ఓదెల సినిమా పట్టాల మీదకు ఎక్కునుంది. మరి, నాని వరుస సినిమాలను లైన్‌లో పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet