iDreamPost
android-app
ios-app

Nani-Janhvi Kapoor: జాన్వీని వద్దంటున్న నాని ఫ్యాన్స్! కారణం ఏంటంటే?

  • Published Jul 19, 2024 | 1:15 PM Updated Updated Jul 19, 2024 | 1:15 PM

తమ హీరోకి జోడీగా జాన్వీ కపూర్ వద్దంటూ నాని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు జాన్వీని వద్దు అనడానికి కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తమ హీరోకి జోడీగా జాన్వీ కపూర్ వద్దంటూ నాని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు జాన్వీని వద్దు అనడానికి కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jul 19, 2024 | 1:15 PMUpdated Jul 19, 2024 | 1:15 PM
Nani-Janhvi Kapoor: జాన్వీని వద్దంటున్న నాని ఫ్యాన్స్! కారణం ఏంటంటే?

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘దసరా’. పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించి.. వంద కోట్లను వసూళ్ చేసింది ఈ మూవీ. మళ్లీ ఈ హిట్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో నానికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ హీరోకి జోడీగా జాన్వీ కపూర్ వద్దంటూ నాని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు జాన్వీని వద్దు అనడానికి కారణం ఏంటి?

జాన్వీ కపూర్.. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవరలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన RC 16లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను కూడా దక్కించుకున్నట్లు టాలీవుడ్ టాక్. దసరా కాంబినేషన్ అయిన నాని-శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీ రాబోతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు టాక్. కానీ నాని సరసన జాన్వీ కపూర్ ను వద్దంటున్నారు ఫ్యాన్స్.

ఓ సినిమాలో హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే ఆ మూవీ సూపర్ సక్సెస్ సాధిస్తుంది. సినిమా విజయంలో వీరి కెమిస్ట్రీ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే హీరోలకి జోడీగా హీరోయిన్స్ ను ఎంపిక చేసేముందు డైరెక్టర్, నిర్మాతలు చాలా ఆలోచిస్తారు. కాగా.. నాని సరసన జాన్వీ కపూర్ ను ఎంపిక చేయడంతో.. ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ‘అన్న నీకు జాన్వీ సెట్ కాదు.. నీకు అక్కలా ఉంటుంది’ నీ పక్కన చూడ్డానికి కూడా బాగోదు’ కీర్తి సురేశ్ నే తీసుకోవచ్చు కదా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ‘హాయ్ నాన్న’ మూవీలో మృణాల్ విషయంలో తప్పు చేశావ్ అన్న.. ఇప్పుడు మరొక తప్పు చేయకు అంటూ సలహాలు ఇస్తున్నారు. నాని పక్కన్న మృణాల్ వయసు ముదిరిన పిల్లలా కనిపించిందని, ఇప్పుడు జాన్వీ విషయంలో కూడా అదే జరుగుతుందా? అని ఆందోళనలో ఉన్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను న్యాచురల్ స్టార్ స్వీకరిస్తాడా? లేడా? అన్నది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş