iDreamPost
android-app
ios-app

Nani: అక్కడ నానికి బిగ్ షాక్.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు!

  • Published Aug 29, 2024 | 7:08 PM Updated Updated Aug 29, 2024 | 7:08 PM

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిపోదా శనివారం మూవీ పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. నాని యాక్టింగ్, యాక్షన్ సీన్స్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. కానీ.. అక్కడ మాత్రం న్యాచురల్ స్టార్ కు ఊహించని షాక్ తగిలింది.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిపోదా శనివారం మూవీ పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. నాని యాక్టింగ్, యాక్షన్ సీన్స్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. కానీ.. అక్కడ మాత్రం న్యాచురల్ స్టార్ కు ఊహించని షాక్ తగిలింది.

  • Published Aug 29, 2024 | 7:08 PMUpdated Aug 29, 2024 | 7:08 PM
Nani: అక్కడ నానికి బిగ్ షాక్.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు!

న్యాచురల్ స్టార్ నాని.. దసరా, హాయ్ నాన్న సాధించిన విజయాలతో మంచి జోష్ లో ఉన్నాడు. దాంతో అతడి నెక్ట్స్ మూవీ సరిపోదా శనివారంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగ్గట్లుగానే సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేశారు. మరీ ముఖ్యంగా నాని ముంబై, కొచ్చి, బెంగళూరు, చెన్నైలలో గట్టిగా ప్రమోషన్లు చేశాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. మూవీని చాలా బాగా ప్రమోట్ చేశాడు. అయితే హిందీ మార్కెట్ లో మాత్రం నాని కష్టానికి ఫలితం దక్కలేదు. అక్కడ న్యాచురల్ స్టార్ కు బిగ్ షాక్ తగిలింది. అసలు ఏం జరిగిందంటే?

‘సరిపోదా శనివారం’ నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుని హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. నాని, ఎస్ జే సూర్యల యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సీన్స్, జేక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్, బీజీఎమ్ సినిమాను వేరే రేంజ్ కు తీసుకెళ్లాయి. దాంతో భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. హిందీ మార్కెట్ లో నానికి ఊహించని షాక్ తగిలింది. నార్త్ బెల్ట్ లో ముంబై కీలకమైన నగరం. పైగా అక్కడ థియేటర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో అక్కడి నుంచి మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు మెండు.

big shock for nani

ఇందుకోసమే నాని ముంబై బెల్టులో గట్టిగా ప్రమోషన్లు చేశాడు. కానీ నాని కష్టానికి ఫలితం దక్కలేదు. హిందీ వెర్షన్ రిలీజ్ కు ముంబై మెుత్తం కలిపి కేవలం ఆరు స్క్రీన్లు మాత్రమే దక్కాయి. తెలుగు వెర్షన్ కు 9 స్క్రీన్లు కేటాయించారు. దాంతో అక్కడ భారీ కలెక్షన్లు కొల్లగొడుతుందని భావించిన మేకర్స్ కు ఎదురుదెబ్బతగిలింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంలో నాని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. ముంబైలో నాని ఓ రేంజ్ లో ప్రమోషన్లు చేశాడు. కానీ.. అతడి కష్టం మెుత్తం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. అయితే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో.. కచ్చితంగా థియేటర్లు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి హిందీలో నానికి ఊహించని షాక్ తగలడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş