iDreamPost
android-app
ios-app

SIIMA 2024: సైమా అవార్డ్స్ 2024.. దసరా, జైలర్ హవా!

  • Published Jul 16, 2024 | 3:45 PM Updated Updated Jul 16, 2024 | 3:45 PM

12వ ఎడిషన్ కు సంబంధించి సైమా 2024 అవార్డ్స్ కు నామినేట్ అయిన చిత్రాల జాబితాను నిర్వాహకులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో నాని, సూపర్ స్టార్ రజినీకాంత్ హవా చూపించారు. ఆ వివరాలు..

12వ ఎడిషన్ కు సంబంధించి సైమా 2024 అవార్డ్స్ కు నామినేట్ అయిన చిత్రాల జాబితాను నిర్వాహకులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో నాని, సూపర్ స్టార్ రజినీకాంత్ హవా చూపించారు. ఆ వివరాలు..

  • Published Jul 16, 2024 | 3:45 PMUpdated Jul 16, 2024 | 3:45 PM
SIIMA 2024: సైమా అవార్డ్స్ 2024.. దసరా, జైలర్ హవా!

సౌత్ ఇండియాన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా).. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన మూవీస్, నటీ, నటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు. 2023లో విడుదల అయిన చిత్రాలకు సంబంధించి 12వ ఎడిషన్ కు నామినేట్ అయిన మూవీస్ లిస్ట్ ను తాజాగా సైమా రిలీజ్ చేసింది. ఈ నామినేషన్స్ లో న్యాచురల్ స్టార్ నాని, సూపర్ స్టార్ రజినీకాంత్ సత్తాచాటారు. తమ హవా చూపించి.. ఎక్కువ మెుత్తంలో నామినేషన్స్ ను దక్కించుకున్నారు.

సైమా అవార్డ్స్ 12వ ఎడిషన్ కు సంబంధించిన నామినేషన్ లిస్ట్(2023లో రిలీజ్ అయిన సినిమాలు) తాజాగా విడుదల చేసింది సైమా టీమ్. తెలుగు నుంచి నాని నటించిన దసరా మూవీ అత్యధికంగా 11 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకోగా.. తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ కూడా 11 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుని సత్తాచాటారు. మరే చిత్రం కూడా ఈ రేంజ్ నామినేషన్స్ దక్కించుకోలేకపోయింది. మిగతా చిత్రాల్లో టొమినో థామన్ ‘2018’(మలయాళం), దర్శన్ ‘కాటేర'(కన్నడ) 8 విభాగాల్లో పోటీ పడుతున్నాయి.

ఇక ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 14, 15 తేదీల్లో దుబాయ్ వేదికగా జరగబోయే వేడుకలో ప్రధానం చేయనున్నారు. నాని దసరా మూవీ ఈ రేంజ్ లో పోటీ పడటం టాలీవుడ్ కే గర్వకారణంగా నిలిచింది. కాగా.. సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్ ఈ వివరాలను మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా విజేతలను నిర్ణయిస్తామని, అభిమానులు తమ ఓట్ ను సైమా ఫేస్ బుక్ ద్వారా ఉపయోగించుకోవచ్చని సైమా టీమ్ తెలిపింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom