iDreamPost
android-app
ios-app

Nani: మహేశ్ బాబు రికార్డుకు ఎసరుపెట్టిన నాని! కొడితే టాప్ లోకే.

  • Published Aug 31, 2024 | 11:26 AM Updated Updated Aug 31, 2024 | 3:35 PM

Nani, Mahesh Babu, Saripodhaa Sanivaaram, Overseas Record: సరిపోదా శనివారం మూవీతో నాని బ్లాక్ బస్టర్ కొట్టాడు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు రికార్డుకు ఎసరు పెట్టేశాడు న్యాచురల్ స్టార్.

Nani, Mahesh Babu, Saripodhaa Sanivaaram, Overseas Record: సరిపోదా శనివారం మూవీతో నాని బ్లాక్ బస్టర్ కొట్టాడు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు రికార్డుకు ఎసరు పెట్టేశాడు న్యాచురల్ స్టార్.

  • Published Aug 31, 2024 | 11:26 AMUpdated Aug 31, 2024 | 3:35 PM
Nani: మహేశ్ బాబు రికార్డుకు ఎసరుపెట్టిన నాని! కొడితే టాప్ లోకే.

‘సరిపోదా శనివారం’ మూవీతో న్యాచురల్ స్టార్ నాని థియేటర్ల దగ్గర రచ్చ చేస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక తొలిరోజే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టి సత్తాచాటింది. వరల్డ్ వైడ్ గా రూ. 24 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు నాని. కాగా.. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు రికార్డుకు ఎసరు పెట్టేశాడు న్యాచురల్ స్టార్ నాని. త్వరలోనే మహేశ్ రికార్డును బద్దలుకొట్టబోతున్నాడు.

నాని మూవీస్ కు యూఎస్ఏ మార్కెట్ లో అద్భుతమైన కలెక్షన్లు ఉంటాయి. ఈ విషయం ఇప్పటికే రుజువైంది. తాజాగా రిలీజ్ అయిన సరిపోదా శనివారం మూవీ కూడా ఓవర్సీస్ లో దూసుకెళ్తోంది. నాని యాక్టింగ్ కు అక్కడి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దాంతో రికార్డు స్థాయిలో అక్కడ వసూళ్లు రాబడుతోంది ఈ మూవీ. ఓవర్సీస్ లో మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో దుమ్మురేపుతోంది. అక్కడ 1 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిపోయింది ఈ చిత్రం. దాంతో ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు న్యాచురల్ స్టార్. ఓవర్సిస్ లో 1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన అత్యధిక సినిమాలు కలిగిన హీరోల్లో నాని సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అతడి 10 సినిమాలు ఈ ఘనతను సాధించాయి.

Saripodaa sanivaram Day2 colections

ఇక ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు అగ్రస్థానంలో ఉన్నాడు. మహేశ్ నటించిన 12 చిత్రాలు అక్కడ 1 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేశాయి. అయితే టైర్ 2 హీరోల్లో మాత్రం నాని టాప్ లో ఉన్నాడు. కాగా.. ప్రిన్స్ రికార్డును మరొకొద్ది రోజుల్లోనే నాని బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే? ప్రస్తుతం మహేశ్-రాజమౌళి కాంబోలో ఓ చిత్రం రాబోతోంది. ఇది విడుదల అయ్యే సరికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. ఈ గ్యాప్ లో నాని నాలుగు సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. దాంతో ఓవర్సీస్ లో రికార్డుల రారాజుగా నాని అగ్రస్థానంలోకి వస్తాడని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. మరి మహేశ్ రికార్డుకే నాని ఎసరు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio