iDreamPost
android-app
ios-app

మాస్, క్లాస్ కాంబో ఇంటర్వ్యూ! ఇదే కొత్త ట్రెండ్!

యానిమల్‌ సినిమా డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ కొద్దిరోజులకు హాయ్‌ నాన్న చిత్రం డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది...

యానిమల్‌ సినిమా డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ కొద్దిరోజులకు హాయ్‌ నాన్న చిత్రం డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది...

మాస్, క్లాస్ కాంబో ఇంటర్వ్యూ! ఇదే కొత్త ట్రెండ్!

స్టార్‌ హీరోలు, దర్శకులు ఒకరి సినిమా ప్రమోషన్లకు మరొకరు రావటం కొత్తేమీ కాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉన్నాయి. అయితే, రోజుల వ్యవధిలో థియేటర్లలో సందడి చేయనున్న ఓ సినిమా దర్శకుడు, మరో సినిమా హీరో ఒకరి సినిమా కోసం ఒకరు ప్రమోషన్లలో పాల్గొనటం మాత్రం ఇండస్ట్రీకి కొత్తే. ఈ కొత్త ట్రెండ్‌కు తెరతీస్తున్నారు యానిమల్‌ చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా.. హాయ్‌ నాన్న సినిమా హీరో న్యాచురల్‌ స్టార్‌ నాని.

ఒకరి సినిమా కోసం ఒకరు ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలలో పాల్గొననున్నారు. అక్కడ తమ సినిమాలను ప్రమోట్‌ చేసుకోనున్నారు. డిసెంబర్‌ 1వ తేదీన యానిమల్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సరిగ్గా ఆరు రోజుల తర్వాత డిసెంబర్‌ 7న హాయ్‌ నాన్న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల బృందాలు ప్రమోషన్లలో బిజీ బిజీ అయిపోయాయి. యానిమల్‌ సినిమాకు సంబంధించి నిన్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు మహేష్‌ బాబు, రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. యానిమల్‌ దర్శకుడు సందీప్‌, హీరో రణవీర్‌ కపూర్‌లపై ప్రశంసల జల్లులు కురిపించారు. రాజమౌళి సందీప్‌రెడ్డిని రామ్‌ గోపాల్‌ వర్మతో పోలుస్తూ పొగిడారు. యానిమల్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించిన చాలా వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. యానిమల్‌ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15 కోట్ల బిజినెస్‌ జరిగింది. ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ అవ్వాలంటే 16 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది.

ఇక, హాయ్‌ నాన్న సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నానికి జంటగా మృణాల్‌ ఠాకూర్‌ నటించారు. శృతి హాసన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. హాయ్‌ నాన్న టీం షూటింగ్‌ మొదలైన నాటి నుంచే ప్రమోషన్లను జోరుగా చేస్తూ వస్తోంది. ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, టీజర్‌ ట్రైలర్‌, పాటలు ఇలా దేన్నీ వదలకుండా ప్రమోట్‌ చేస్తూ వస్తోంది. హీరో,హీరోయిన్లు చాలా చురుగ్గా ప్రమోషన్లు చేస్తూ వస్తున్నారు. కొన్ని మీడియాలకు ఫన్నీ ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు.

ఈ సినిమాపై మొదటి నుంచి బజ్‌ ఉంది. ట్రైలర్‌ రిలీజైన తర్వాత అంచనాలు పెరిగిపోయాయి. కాగా, నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ప్రముఖ తమిళ దర్శకుడు .. డాన్‌ ఫేమ్‌ ‘శిబి చక్రవర్తి’తో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత హిట్టు ఫ్రాంచైజీలో రానున్న హిట్‌ 3 సినిమాలో నటించనున్నారు. హిట్‌ 3కి శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తారు. మరి, నాని, సందీప్‌ల మాస్, క్లాస్ కాంబో ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet