iDreamPost
android-app
ios-app

SJ Suryah: గేమ్ ఛేంజర్ లో SJ సూర్య  పాత్ర.. హైప్ పెంచేసిన దిల్ రాజు కామెంట్స్!

  • Published Sep 06, 2024 | 8:59 AM Updated Updated Sep 06, 2024 | 8:59 AM

Dil Raju comments on SJ Suryah, Game Changer: సరిపోదా శనివారం మూవీ సక్సెస్ మీట్ లో గేమ్ ఛేంజర్ లో ఎస్ జే సూర్య పాత్ర ఎలా ఉండబోతోందో చెప్పి.. అందరిలో ఆసక్తి పెంచారు నిర్మాత దిల్ రాజు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Dil Raju comments on SJ Suryah, Game Changer: సరిపోదా శనివారం మూవీ సక్సెస్ మీట్ లో గేమ్ ఛేంజర్ లో ఎస్ జే సూర్య పాత్ర ఎలా ఉండబోతోందో చెప్పి.. అందరిలో ఆసక్తి పెంచారు నిర్మాత దిల్ రాజు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

SJ Suryah: గేమ్ ఛేంజర్ లో SJ సూర్య  పాత్ర.. హైప్ పెంచేసిన దిల్ రాజు కామెంట్స్!

SJ సూర్య.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దాదాపు ఏ సినిమాలో చూసిన ఈయన పేరే వినిపిస్తోంది. విలక్షణమైన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు సూర్య. దాంతో మేకర్స్ కు విలన్ క్యారెక్టర్స్ ఫస్ట్ ఛాయిస్ గా మారాడు. తాజాగా నాని హీరోగా వచ్చిన ‘సరిపోదా శనివారం’ మూవీలో దయానంద్ పాత్ర పోషించాడు. ఈ పాత్రకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఎస్ జే సూర్య యాక్టింగ్ కు ఈ చిత్రంలో మంచి మార్కులు పడటంతో పాటుగా.. ప్రేక్షకులు బాగా ఎంజయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గేమ్ ఛేంజర్ లో ఎస్ జే సూర్య పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.

న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో ఎస్ జే సూర్య యాక్టింగ్ కు ప్రేక్షకులతో పాటుగా ఇండస్ట్రీ మెుత్తం ఫిదా అవుతోంది. నానియే స్వయంగా నా పాత్ర కంటే ఆయన పాత్రే మీకు ఎక్కువ గుర్తుంటుంది అని చెప్పడం బట్టే ఆయన యాక్టింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ చిత్రం.. భారీ కలెక్షన్లను సాధించే దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు హాజరమైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ లో ఎస్ జే సూర్య పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దిల్ రాజు మాట్లాడుతూ..”అప్పట్లో మహేశ్ బాబు నటించిన ‘ఒక్కడు’ మూవీలో ప్రకాశ్ రాజు క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి ఓ విలన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీలో ఎస్ జే సూర్య యాక్టింగ్ అందరిని షాక్ గురిచేసింది. అలాగే గేమ్ ఛేంజర్ లో కూడా ఆయన చేసిన విలన్ పాత్రను అదిరిపోతుంది. ఒక విధంగా మీరు దాన్ని ఊహించరు. మా సినిమాలో కూడా ఆయన యాక్టింగ్ కు థియేటర్లలో పేపర్స్ పడతాయి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన కామెంట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశాయి. రామ్ చరణ్ ను ఎస్ జే సూర్య ఢీ కొట్టే సీన్స్ ఎప్పుడెప్పుడు చూడాలని ఆసక్తిగా ఉన్నారు.

కాగా.. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డేట్ ఎప్పుడన్నది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అందరూ డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల అవుతుందని అనుకుంటున్నారు. రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ నటిస్తుండగా.. సునీల్, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ లో ఎస్ జే సూర్య పాత్రపై దిల్ రాజు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş