iDreamPost
android-app
ios-app

Nani-Janhvi Kapoor: నెక్ట్స్ మూవీలో జాన్వీ కపూర్.. నాని ఏమన్నాడంటే?

  • Published Aug 26, 2024 | 12:39 PM Updated Updated Aug 26, 2024 | 12:39 PM

తన నెక్ట్స్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందన్న వార్తలపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు న్యాచురల్ స్టార్ నాని. తన ఆన్సర్ తో ప్రేక్షకుల్లో మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాడు.

తన నెక్ట్స్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందన్న వార్తలపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు న్యాచురల్ స్టార్ నాని. తన ఆన్సర్ తో ప్రేక్షకుల్లో మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాడు.

  • Published Aug 26, 2024 | 12:39 PMUpdated Aug 26, 2024 | 12:39 PM
Nani-Janhvi Kapoor: నెక్ట్స్ మూవీలో జాన్వీ కపూర్.. నాని ఏమన్నాడంటే?

న్యాచురల్ స్టార్ నాని త్వరలోనే ‘సరిపోదా శనివారం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 29న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాని వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన నెక్ట్స్ మూవీలో జాన్వీ కపూర్ నటిస్తుందన్న వార్తలపై స్పందించాడు. ఈ న్యూస్ పై నాని ఏమన్నాడంటే?

‘సరిపోదా శనివారం’ మూవీ ఆగస్ట్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా హీరో న్యాచురల్ స్టార్ నాని వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ ను హోరెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన నెక్ట్స్ సినిమాలో ఉందా? లేదా? అన్నదానిపై స్పందించాడు. ‘మీ నెక్ట్స్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట నిజమేనా?’ అని రిపోర్టర్ ప్రశ్నించాడు. దానికి నాని స్పందిస్తూ..

nani with jahnvi kapoor

“నా నెక్ట్స్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందనేది కేవలం రూమర్ మాత్రమే. అయితే ఆమెను మూవీలో  తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. సినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ జరుగుతోంది. నేను వరుసగా షూటింగ్స్, ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాను కాబట్టి.. ఆ మూవీ పూర్తి వివరాలు తెలీదు” అంటూ చెప్పుకొచ్చాడు. ఒక పక్క రూమర్ అని చెప్పుకొచ్చిన నాని, మరో పక్క చర్చలు జరుగుతుండొచ్చు అంటూ ఫ్యాన్స్ కు కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. కాగా.. ప్రస్తుతం జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర, రామ్ చరణ్-బుచ్చిబాబు RC16లో నటిస్తోంది. మరోవైపు నాని డైరెక్టర్ శైలేష్ కొలను తో హిట్ 3, సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. మరి నానికి జోడీగా జాన్వీ నటిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş