iDreamPost
android-app
ios-app

నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. శరీరాన్ని టార్చర్‌ చేయకూడదు!

  • Published Dec 07, 2023 | 11:18 AM Updated Updated Dec 07, 2023 | 11:18 AM

నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన హాయ్‌ నాన్న సినిమా డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది...

నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన హాయ్‌ నాన్న సినిమా డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది...

  • Published Dec 07, 2023 | 11:18 AMUpdated Dec 07, 2023 | 11:18 AM
నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. శరీరాన్ని టార్చర్‌ చేయకూడదు!

న్యాచురల్‌ స్టార్‌ నాని తాజాగా రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా ‘ హాయ్‌ నాన్న’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకులనుంచే గాక, రివ్యూవర్ల నుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. హాయ్‌ నాన్న చూసిన వాళ్లు కొత్త దర్శకుడు శౌర్యవ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక, సినిమా విడుదల నేపథ్యంలో నిన్నటి వరకు చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీ, బిజీగా గడిపింది. నాని ప్రమోషన్ల కోసం పక్క రాష్ట్రంతో పాటు అమెరికా కూడా వెళ్లివచ్చారు.

 నిన్న కర్ణాటక వెళ్లిన నాని.. అక్కడ కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ను కలిశారు. శివరాజ్‌ కుమార్‌ ఇంటికి వెళ్లి నాని భేటీ అయ్యారు. కొంతసేపు ఆయనతో మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. ఫిట్‌నెస్‌పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఫిట్‌నెస్‌ గురించిన ఓ ప్రశ్న ఎదురైంది. దానికి నాని సమాధానం ఇస్తూ.. తాను ఎప్పుడూ పని చేస్తూ ఉంటానని అన్నారు.

ఇంట్లోనే ఉంటూ లేవకుండా.. పని చేయకుండా ఉంటే అది కచ్చితంగా బరువు పెరగడానికి కారణమవుతుందని చెప్పారు. తను ఏదైనా తినేస్తానని, స్టేట్‌మెంట్‌ ఇచ్చేంత ప్రొఫెషనల్‌ కాదని అన్నారు. తనకు తెలిసిన వాళ్లు డైట్‌ పేరిట తినడం మానేశారని, కొద్దిరోజుల తర్వాత మళ్లీ బరువు పెరుగుతున్నారని చెప్పారు. వాళ్లు శరీరాన్ని టార్చర్‌ చేయటం వల్లే అలా జరుగుతోందని అన్నారు. చిన్నప్పటినుంచి మనం తినే దానికే శరీరం అలవాటు పడుతుందని చెప్పారు.

చిన్నప్పటినుంచి మనం తిన్న ఫుడ్డే మన బాడీకి సెట్‌ అవుతుందని వెల్లడించారు. ఇంట్లో అమ్మ వండే పిండి వంటలు అలవాటు ఉంటే తినొచ్చని, కానీ, అమితంగా తినకూడదని చెప్పారు. ప్రతి రోజూ ఇంట్లో భోజనం తింటూ.. ఒకే రోజు సడెన్‌గా సలాడ్‌లు తింటే బాడీ తట్టుకోలేదని చెప్పారు. బాడీ రెడీగా ఉండదని వివరించారు. ఆ విషయం తనకు అర్థం అయిందని అన్నారు. ఎవరు.. ఎదైనా తినవచ్చని కానీ, కంట్రోల్‌లో ఉండాల’’ ని పేర్కొన్నారు.

కాగా, హాయ్‌ నాన్న సినిమాలో నానికి జంటగా మృణాల్‌ ఠాకూర్‌ నటించారు. జయరామ్‌, ప్రియదర్శి, అంగద్‌ బేడీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక, ఈ మూవీ ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో డిసెంబర్‌ చివరి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరి, నాని ఫిట్‌నెస్‌పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom