iDreamPost
android-app
ios-app

హాయ్‌ నాన్న ట్రైలర్‌ రివ్యూ!

న్యాచురల్‌ స్టార్‌ నాని- హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ హాయ్‌ నాన్న’. ఈ సినిమా డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

న్యాచురల్‌ స్టార్‌ నాని- హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ హాయ్‌ నాన్న’. ఈ సినిమా డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

హాయ్‌ నాన్న ట్రైలర్‌ రివ్యూ!

‘దసరా’ సినిమాతో మాస్‌ ఆడియన్స్‌ను ఫుల్‌ ఫిదా చేశారు న్యాచురల్‌ స్టార్‌ నానీ. ఆ సినిమా సాధించిన విజయంతో ఆయన తర్వాతి సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. నాని తనకు మొదటినుంచి అచ్చు వస్తున్న లవ్‌ స్టోరీని ఎంచుకున్నారు. ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హాయ్‌ నాన్న ప్యాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కింది. సీతారామం సినిమాతో తెలుగునాట సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న మృణాల్‌ ఠాకూర్‌ ఈ చిత్రంలో నానికి జంటగా నటించారు. ‘హాయ్‌ నాన్న’ మొదలైన నాటినుంచే సినిమా టీం ‍ప్రమోషన్లను మొదలెట్టింది.

నాని, మృణాల్‌లు తరచుగా మీడియా, సోషల్‌ మీడియా ముందుకు వస్తూ మూవీ ప్రమోషన్‌ చేస్తూ ఉన్నారు. ఇక, హాయ్‌ నాన్న నుంచి వచ్చిన ప్రతీ పాటకు మంచి స్పందన వచ్చింది. పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో సైతం నిలిచాయి. ప్రతీ పాట సినిమాపై అంచనాలను పెంచుతూ పోయింది. ఇక, డిసెంబర్‌ 7వ తేదీన ‘హాయ్‌ నాన్న’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. నవంబర్‌ 24వ తేదీన చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.  తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ట్రైలర్‌ రిలీజైంది. ట్రైలర్‌కు విడుదలైన ప్రతీ భాషలో మంచి స్పందన వచ్చింది.

ట్రైలర్‌ ఎలా ఉందంటే..

ఇది లవ్‌ స్టోరీ.. తండ్రి కూతురు మధ్య లవ్‌స్టోరీ.. ఓ ప్రియుడు, ప్రియురాలి మధ్య లవ్‌స్టోరీ. రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో శౌర్యవ్‌ సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉండబోతోందో చూపించేశాడు. ట్రైలర్‌లో పరిచయం చేసింది కొన్ని పాత్రలే అయినా.. ప్రతీ పాత్ర పరిచయం అద్భుతంగా ఉంది. సినిమాకు సంబంధించి కీలక పాత్రల మధ్య మానసిక సంఘర్షణ ఎలా ఉండబోతోందో డైలాగులను బట్టి తెలుస్తుంది. ట్రైలర్‌ సింపుల్‌, అండ్‌ క్లీన్‌గా ఉంది. సినిమాకు రావాలనుకునే వారికి ఓ క్లారిటీ ఇచ్చినట్లు ఉంది. ఇదో బ్యూటిఫుల్‌ ఫ్యామిలీ లవ్‌ డ్రామా అని దర్శకుడు శౌర్యవ్‌ చెప్పకనే చెప్పాడు.

కాగా, ఈ సినిమాకు శౌర్యవ్‌ దర్శకత్వం వహించారు. జయరామ్‌, అంగద్‌ బేడీ, బేబీ కియారా ఖన్నా, హెమయత్‌ రహ్మాన్‌ తదితరులు నటించారు. శృతి హాసన్‌ హాయ్‌ నాన్నలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వనున్నారు. ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. హెషమ్‌ అబ్ధుల్‌ వాహద్‌ సంగీతం అందించారు. నాగేంద్ర కాశీ, శౌర్యవ్‌ ఇద్దరూ కలిసి కథను రాసుకున్నారు. సను వర్గీస్‌ సినిమాటోగ్రఫీ చేశారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్‌ హాయ్‌ నాన్న సినిమాను తెరకెక్కించింది. మరి, హాయ్‌ నాన్న ట్రైలర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.