iDreamPost
android-app
ios-app

దసరా మాటలు నిజం కాలేదు. మరి ఈసారి నాని?

  • Published Dec 05, 2023 | 7:27 PM Updated Updated Dec 05, 2023 | 7:27 PM

నాని నటించిన హాయ్‌ నాన్న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమా పై నాని చేస్తున్న కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన సినిమా హిట్ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

నాని నటించిన హాయ్‌ నాన్న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమా పై నాని చేస్తున్న కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన సినిమా హిట్ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

  • Published Dec 05, 2023 | 7:27 PMUpdated Dec 05, 2023 | 7:27 PM
దసరా మాటలు నిజం కాలేదు. మరి ఈసారి నాని?

నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన హాయ్ నాన్న సినిమా ఈ వారంలో 7వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రలో నటించడం ఆసక్తికర విషయం. నాని ఈ సినిమాలో ఏడు ఎనిమిదేళ్ల అమ్మాయికి తండ్రిగా కనిపించబోతున్నాడు. ఆ పాప తల్లి ఎవరు అనేది ఆసక్తిని కలిగిస్తున్న విషయం. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అంటూ నానితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

ఈ సమయంలో నాని వ్యాఖ్యలు చూస్తూ ఉంటే గతంలో ఆయన తన దసరా సినిమా విడుదల సమయంలో చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నాని దసరా సినిమా విడుదల సమయంలో ఇది ఇలా వచ్చి అలా వెళ్లే సినిమా కాదు. ఎలా అయితే ఆర్‌ఆర్ఆర్‌, కాంతార, కేజీఎఫ్‌ ల గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారో.. ఇంకా మాట్లాడుకుంటున్నారో అలాగే దసరా సినిమా గురించి మాట్లాడుకుంటారు.. ఈ ఏడాదిలో నిలిచి పోయే సినిమా అన్నట్లుగా దసరా సినిమా ఉంటుంది అన్నట్లుగా నాని కామెంట్స్‌ చేయడం జరిగింది. అంతే కాకుండా దర్శకుడి పేరు ఇప్పటి వరకు పెద్దగా తెలియకపోవచ్చు.. ముందు ముందు ఈ పేరు మారుమ్రోగడం ఖాయం అన్నట్లుగా కూడా నాని వ్యాఖ్యలు చేశాడు.

దసరా సినిమా ఫలితం ఏంటో అందరికీ తెల్సిందే. పాన్‌ ఇండియా మూవీ అంటూ హడావుడి చేశారు. కనీసం తెలుగు రాష్ట్రాల్లో కూడా మినిమం వసూళ్లు సాధించడంలో దసరా సినిమాతో నాని చేతులు ఎత్తేశాడు. ఆ సినిమా ఫలితం గురించి పట్టింపు లేకుండా నాని వెంటనే హాయ్ నాన్నతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. హాయ్ నాన్న సినిమా పై కూడా నాని చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకంగా ఉంటే పర్వాలేదు దసరా సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేశాడో అలాంటి నమ్మకం వ్యాఖ్యలను నాని హాయ్ నాన్న గురించి చేయడం కొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

నా ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ అవుతుంది అని నాని ఒక కార్యక్రమంలో అన్నాడు. ఈ సినిమా చేసిన తర్వాత నాకు ఒక కూతురు ఉంటే బాగుంటుంది అనిపించింది అని కూడా నాని అన్నాడు. ఇంకా ఈ సినిమా ఒక అద్భుతం అంటూ కొన్ని సార్లు, ఇలాంటి సినిమా చేయడం అదృష్టం అని, ఇలాంటి కథతో మరెవ్వరు కూడా సినిమాలు చేయలేదు అన్న రీతిలో నాని వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి.. ఇలా నాని చాలా వ్యాఖ్యలు చేశాడు. మరి హాయ్ నాన్న ఈసారి నాని నమ్మకం నిలిపేనా లేదంటే దసరా మాదిరిగానే నిరాశ పరుచుతుందా అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకు మీరు నాని వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారు…? హాయ్ నాన్నతో నాని చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని మీకు అనిపిస్తుందా?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss