iDreamPost
android-app
ios-app

Nani: మరో క్రేజీ ప్రాజెక్ట్​కు నాని గ్రీన్​సిగ్నల్? డైరెక్టర్-హీరోయిన్​ది బ్లాక్ ​బస్టర్ కాంబో!

  • Published Sep 12, 2024 | 3:57 PM Updated Updated Sep 12, 2024 | 3:57 PM

Sekhar Kammula planning a film with Nani and Sai Pallavi: టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

Sekhar Kammula planning a film with Nani and Sai Pallavi: టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

Nani: మరో క్రేజీ ప్రాజెక్ట్​కు నాని గ్రీన్​సిగ్నల్? డైరెక్టర్-హీరోయిన్​ది బ్లాక్ ​బస్టర్ కాంబో!

చిత్ర పరిశ్రమలో కాంబినేషన్ లను ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. పలానా హీరోతో పలానా డైరెక్టర్ మూవీ పడితే చూడాలని ప్రేక్షకులు కలలు కంటూ ఉంటారు. అలాగే.. ఆ హీరోయిన్ తో తమ అభిమాన హీరో జతకడితే.. సినిమా బ్లాక్ బస్టర్ కావడం పక్కా ఇంకొందరు ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబో రాబోతున్నట్లు తెలుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలయికలో ఓ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రాబోతుందా? అంటే ఇండస్ట్రీ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. నానికి సూట్ అయ్యే కథ శేఖర్ కమ్ముల దగ్గర రెడీగా ఉన్నట్లు సమాచారం. పైగా నాని కూడా ఈ క్రేజీ డైరెక్టర్ తో పని చేయడానికి ఉత్సాహం చూపుతున్నాడు. ఇక ఈ మూవీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఆమె అయితేనే ఈ పాత్రను న్యాయం చేస్తుందని వారి ఆలోచన. పైగా శేఖర్ కమ్ములది సాయి పల్లవిది బ్లాక్ బస్టర్ కాంబో. వీరిద్దరు గతంలో ఫిదా, లవ్ స్టోరీ సినిమాకు పని చేశారు. దాంతో శేఖర్ కమ్ముల మాట సాయి పల్లవి కాదనకపోవచ్చు.

Nani combo

ఇదిలా ఉండగా.. సాధారణంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాతే మరోటి స్టార్ట్ చేస్తాడు. కానీ.. తన రూట్ మార్చి.. ఒక చిత్రం షూటింగ్ దశలో ఉండగానే, మరో మూవీని ట్రాక్ పైకి ఎక్కించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ధనుష్ తో ‘కుబేర’ చేస్తున్నాడు. ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే.. ఈ చిత్రం పూర్తవగానే.. ధనుష్ తోనే మరో చిత్రం చేయనున్నట్లు సమాచారం. కానీ.. ధనుష్ ఇంతకు ముందే ఒప్పుకున్న ప్రాజెక్ట్ ఉంటే మాత్రం ఈ స్టార్ డైరెక్టర్ వెయిట్ చేయక తప్పదు. ఈ గ్యాప్ లో నానితో ఓ చిత్రం చేయడానికి సిద్దం అవుతున్నాడట. కాగా.. నాని హిట్ 3 పూర్తి చేసిన తర్వాత సుజిత్ తో ఒక మూవీ.. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీని క్యూలో పెట్టాడు. ఇవి కంప్లీట్ అయిన తర్వాతే శేఖర్ కమ్ములతో ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. నాని-శేఖర్ కమ్ముల-సాయి పల్లవి కాంబోలో మూవీ కోసం చాలా మంది ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş