Somesekhar
నానిపై బాలీవుడ్ పగబట్టిందా? ఎందుకింత కక్ష? అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది? నిజంగానే బాలీవుడ్ న్యాచురల్ స్టార్ పై పగబట్టిందా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నానిపై బాలీవుడ్ పగబట్టిందా? ఎందుకింత కక్ష? అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది? నిజంగానే బాలీవుడ్ న్యాచురల్ స్టార్ పై పగబట్టిందా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
నాని.. న్యాచురల్ స్టార్ గా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక వివాదాలకు దూరంగా ఉండే నటుల్లో నాని ముందుంటాడు. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి నాని వెళ్లిన దాఖలాలు లేవు. ఇలాంటి మంచి మనసున్న హీరోపై బాలీవుడ్ పగబట్టిందా? అంటే అవుననే సమాధానాలే నెటిజన్స్ నుంచి వినిపిస్తున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. నానిపై ఎందుకింత కక్ష? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే?
నాని ‘సరిపోదా శనివారం’ మూవీతో తాజాగా థియేటర్లలో రచ్చ చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. థియేటర్లు మెుత్తం హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. అయితే బాలీవుడ్ లో మాత్రం నానికి ఊహించని షాక్ తగిలింది. హిందీ వెర్షన్ లో ముంబైలో ఈ సినిమాను రిలీజ్ చేయగా.. కేవలం 6 స్క్రీన్లను మాత్రమే దక్కించుకుంది. అక్కడ తెలుగు వెర్షన్ కూడా 9 స్క్రీన్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే? హిందీ మార్కెట్ లో నాని మంచి మార్కెటే ఉంది. పైగా ముంబైలో గట్టిగా ప్రమోషన్లు కూడా చేశాడు. అదీకాక అక్కడ ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా థియేటర్లలో లేవు.
బాలీవుడ్ లో ఒక్క స్త్రీ 2 మాత్రమే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అదొచ్చి కూడా వారం దాటేసింది. అలాంటప్పుడు సరిపోదా శనివారం మూవీకి థియేటర్లు ఇంత తక్కువ దొరకడం ఏంటి? ఇది కచ్చితంగా కక్షపూరిత చర్యే అని నాని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బాలీవుడ్ తమ హీరోపై పగబట్టిందని చెప్పుకొస్తున్నారు. దానికి కారణం నాని ఇటీవలే బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై తర్వాత వివరణ ఇచ్చుకుని కాంట్రవర్సీని ముగించాడు. కానీ.. ఈ విషయాన్ని అక్కడున్న కొందరు మనసులో పెట్టుకునే ఇలా నాని మూవీకి తక్కువ థియేటర్లు దక్కేలా చేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నాని మూవీకి ఇలా జరిగి ఉండకూడదని సగటు సినీ అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరి సరిపోదా శనివారం మూవీకి ముంబైలో ఇంత తక్కువ స్క్రీన్లు దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.