iDreamPost
android-app
ios-app

Nani: ‘సరిపోదా శనివారం’ కథ చెప్పేసిన SJ సూర్య! షాక్ లో ఫ్యాన్స్..

  • Published Aug 08, 2024 | 9:10 AM Updated Updated Aug 08, 2024 | 9:10 AM

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్ జే సూర్య.. సరిపోదా శనివారం కథ ఏంటో చెప్పేశాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్ జే సూర్య.. సరిపోదా శనివారం కథ ఏంటో చెప్పేశాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Aug 08, 2024 | 9:10 AMUpdated Aug 08, 2024 | 9:10 AM
Nani: ‘సరిపోదా శనివారం’ కథ చెప్పేసిన SJ సూర్య! షాక్ లో ఫ్యాన్స్..

న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించగా.. ఆగస్ట్ 29న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాడు. మేకర్స్ సైతం ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేశారు. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య.. సరిపోదా శనివారం కథ ఏంటో చెప్పేశాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. అదేంటి సార్ ఇలా స్టోరీ లీక్ చేశారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సాధారణంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించే ఈవెంట్స్ లో హీరోలు, డైరెక్టర్లు, కొందరు నటీ, నటులు సినిమా స్టోరీ గురించి హింట్స్ ఇస్తూ ఉంటారు. ఇక మరికొందరు మాత్రం అనుకోకుండా తమ నోటివెంట కథ, ట్విస్ట్ లను రివీల్ చేస్తుంటారు. కానీ కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్ జే సూర్య మాత్రం ఏకంగా సరిపోదా శనివారం సినిమా కథనే చెప్పేశాడు. ఆగస్ట్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్నాడు నాని. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య ఈ సినిమా సోల్ ను చెప్పేశాడు.

SJ Surya who leaked the Saturday story!

ఎస్ జే సూర్య మాట్లాడుతూ..”ఈ సినిమాలో నానికి చిన్నతనం నుంచి కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. దాంతో భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయని వాళ్ల అమ్మ ఓ మాట చెబుతుంది. నీ కోపాన్ని వారంలో అన్ని రోజులు కాదు, కేవలం శనివారం రోజున మాత్రమే చూపించు అని చెబుతుంది. ఇక తన కోపాన్ని చూపించడనికి నాని శనివారం దాకా ఆగుతుంటాడు. అలా ఆదివారం నుంచి శుక్రవారం వరకు నాని బాషా మూవీలో మాణిక్యంలా, శనివారం మాత్రం బాషాలా మారుతుంటాడన్న మాట” అంటూ స్టోరీ మెుత్తం చెప్పేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారాడంతో.. ఏంటి సర్ ఇంత పనిచేశారు అంటూ ఫ్యాన్స్, మేకర్స్ టెన్షన్ కు గురౌతున్నారు. అయితే పబ్లిసిటీలో భాగంగా ఇది మేకర్స్ ప్లానే అని కొంత మంది అభిమానులు కామెంట్స్ చేస్తుండగా.. కాదు అని మరికొంత మంది వాదిస్తున్నారు. మరి ఎస్ జే సూర్య ఇలా స్టోరీ రివీల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet