iDreamPost
android-app
ios-app

OTT Release: సరిపోదా శనివారం OTT డేట్ ఫిక్స్? స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Sep 16, 2024 | 9:25 AM Updated Updated Sep 16, 2024 | 9:25 AM

Saripoda Sanivaaram OTT Release Date: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

Saripoda Sanivaaram OTT Release Date: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

  • Published Sep 16, 2024 | 9:25 AMUpdated Sep 16, 2024 | 9:25 AM
OTT Release: సరిపోదా శనివారం OTT డేట్ ఫిక్స్? స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాని, ఎస్ జే సూర్య యాక్టింగ్ కు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. దాంతో థియేటర్ల వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అదరహో అనిపించింది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

సరిపోదా శనివారం మూవీతో నాని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎస్ జే సూర్య, నాని మాస్ యాక్టింగ్ కు వివేక్ ఆత్రేయ టేకింగ్ యాడ్ అవ్వడంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 26 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. దాంతో మూవీని థియేటర్లలో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.  ఇక ఇప్పుడు వారి వెయిటింగ్ కు పుల్ స్టాప్ పడబోతోంది.

కాగా.. సరిపోదా శనివారం మూవీ 100 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇందులో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించి మెప్పించింది. ఇక నాని ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘హిట్ 3’ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సుజిత్ తో ఓ చిత్రం చేయాల్సి ఉంది. వీటితో పాటుగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ మూవీని కమిట్ అయ్యాడు. ఇక తాజాగా సైమా 2024 అవార్డ్స్ లో దసరా మూవీలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు. అలాగే నాని నటించిన హాయ్ నాన్న చిత్రానికి నాలుగు విభాగాల్లో, దసరా మూవీకి సైతం నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş