తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని జూనియర్ కాలేజీ ప్రహరీ గోడ వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సహా పలువురు టీడీపీ నేతలపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించి పిల్లర్లను కూల్చివేశారని.. జేసీ సహా ఇతర టీడీపీ నేతల మీద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అలాగే ముందస్తు జాగ్రత్తగా జేసీ నివాసం […]
జేసీ ప్రభాకర్ రెడ్డి.. రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అనంతపురం జిల్లాకు చెందిన ఈ టీడీపీ నేత నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈయనకు సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ పై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఎస్3 వాహనాలను ..బిఎస్4 గా మార్చి నడుపుతున్నారని అభియోలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతపురం […]
కొంతకాలంగా మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. ఇది ఆయన వ్యవహారశైలికి పూర్తిగా విరుద్ధం. అందుకే జేసీ దివాకర్ రెడ్డి వైపు అందరూ చూస్తున్నారు. ఎప్పుడూ తన భావాలను నిర్మొహమాటంగా చెబుతూ మీడియాలో హల్‌చల్ చేసే జేసీ దివాకర్ రెడ్డి.. ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానికంగా కొంత హడావుడి చేస్తున్నా.. జేసీ బ్రదర్స్ తీరు తమ్ముళ్లలో టెన్షన్‌ను రేకెత్తిస్తోంది. టీడీపీ […]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రతిపక్ష టీడీపీలో సీటు పోరు ప్రారంభమైంది. ఒకరి సీటుకు మరొకరు ఎసరుపెట్టే ప్రయత్నాలు ప్రారంభం కావడంతో టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మరోసారి తనకు సీటుకు ఎసరుపెట్టే ప్రయత్నాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై మాజీ మంత్రి, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఫైర్ అయ్యారు. తన జోలికి వస్తే ఊరుకునేది లేదని పల్లె తీవ్ర స్వరంతో హెచ్చరించారు. […]
శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఆయా పార్టీలలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కాపాడుకోవడం కోసం కొందరు, కొత్తగా పోటీ చేసేందుకు మరికొందరు, తన వర్గం వారికి టిక్కెట్ ఇప్పించుకోవాలనే ప్రయత్నాల్లో సీనియర్ నేతలు తమ తమ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తాజాగా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన చర్యల ద్వారా స్పష్టమవుతోంది. అనంతపురం జిల్లాలో టీడీపీలో తనకంటూ ప్రత్యేకమైన, బలమైన వర్గం తయారు […]
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్ జగన్ నైతిక విలువలున్న నేతని ప్రశంసించారు. అందుకే తాను చైర్మన్ అయ్యానని చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నేతలను ప్రశంసలతో ముంచెత్తిన జేసీ ప్రభాకర్ రెడ్డి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాత్రమే కాదు.. జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా నైతిక విలువలున్న నేతని చెప్పుకునేందుకు అవకాశం ఉంది. చెప్పిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా జేసీపై తాడిపత్రి ప్రజలు, ముఖ్యమంగా టీడీపీ […]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టే జేసీ సోదరుల వాయిస్ లో ఏదో కొత్త స్వరం వినిపిస్తోంది. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టిడిపి తరఫున మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మీద ప్రశంసలు కురిపించడం కొత్త చర్చకు దారితీస్తోంది. వైయస్ రాజశేఖర్రెడ్డి నైతిక విలువలను జగన్ పాతీస్తున్నారంటూ ఆయన మాట్లాడటం చూస్తుంటే మళ్ళీ ఎక్కడో తేడా కనిపిస్తోంది. ప్రభాకర్ రెడ్డి అన్నది అక్షర సత్యం తాడిపత్రి మున్సిపాలిటీలో […]
గోడవలు లేవు, ఉద్రిక్త పరిస్థితులు లేవు. కొట్లాటలు అంతకన్నా లేవు. అధికార దుర్వినియోగం లేదు, ట్విస్ట్‌లు లేవు.. అత్యంత ప్రజా స్వామికంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ప్రజా తీర్పునకు అనుగుణంగానే తాడిపత్రిలో పురపాలక మండలి ఏర్పాటైంది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ గెలుచుకుంది. మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు. మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డులున్న తాడిపత్రిలో రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు […]
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. 36 వార్డులకు గాను టీడీపీ ఇక్కడ 18 వార్డులను గెలుచుకోవడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎక్స్ అఫిషియో ఓట్లతో అధికార వైసీపీ చైర్మన్ పీఠాన్ని గెలుచుకుంటుందని భావించగా.. అందుకు తాజాగా మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలతో దారులుమూసుకుపోయాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం వైసీపీ ఎమ్మెల్సీలు మహ్మద్ ఇక్బాల్, శమంతకమణి, గోపాల్ రెడ్డిలు, టీడీపీ […]
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అశ్మిత్ రెడ్డిలకు ఉచ్చు బిగుస్తోందా..? ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా వాహనాలను విక్రయించిన కేసులో వారు పూర్తిగా ఇరుక్కుపోయారా..? రాజకీయ కక్షతోనే తమపై కేసులు పెట్టారని చేసిన విమర్శలు తేలిపోయాయా..? చంద్రబాబు అండ్‌కో చేసిన విమర్శలు అన్నీ రాజకీయ రాద్ధాంతమేనని తేలిపోయిందా..? అంటే తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు విన్నవారి నుంచి ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తోంది. రాజకీయ కక్షతో తమపై వైసీపీ సర్కార్ […]