Nidhan
టీమిండియా నయా కోచ్ గౌతం గంభీర్ ఎరా రేపటి నుంచి మొదలవనుంది. లంక సిరీస్‌తో అతడి ఫస్ట్ ఎసైన్మెంట్ స్టార్ట్ కానుంది.
టీమిండియా నయా కోచ్ గౌతం గంభీర్ ఎరా రేపటి నుంచి మొదలవనుంది. లంక సిరీస్‌తో అతడి ఫస్ట్ ఎసైన్మెంట్ స్టార్ట్ కానుంది.
Nidhan
టీమిండియా నయా కోచ్ గౌతం గంభీర్ ఎరా రేపటి నుంచి మొదలవనుంది. శ్రీలంక సిరీస్‌తో అతడి ఫస్ట్ ఎసైన్మెంట్ స్టార్ట్ కానుంది. ఇరు టీమ్స్ మధ్య శనివారం తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొన్ని రోజుల ముందే లంకకు చేరుకున్న మెన్ ఇన్ బ్లూ.. ముమ్మురంగా సాధన చేశారు. ఆతిథ్య జట్టును వైట్ వాష్ చేయాలనే కసితో ప్రాక్టీస్ చేశారు. కొత్త కోచ్ గౌతం గంభీర్ దగ్గర నుంచి ప్రతి ప్లేయర్ గేమ్‌ను అబ్జర్వ్ చేశాడు. టెక్నిక్ మెరుగుపర్చుకోవడంపై వాళ్లతో డిస్కస్ చేశాడు. ఎక్కడ తప్పు చేస్తున్నారో గమనించి వాళ్లకు అర్థమయ్యేలా వివరించాడు. కెప్టెన్ సూర్యతో కూడా చర్చిస్తూ కనిపించాడు గంభీర్.
ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌తో కలసి ప్లేయర్లు అందరితో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించాడు గంభీర్. త్రోలు విసరడం, రన్నింగ్ క్యాచ్‌లు అందుకోవడం, డైవ్‌లు చేయడంపై స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. ఇలా గత రెండ్రోజులుగా ఆటగాళ్లందరితో ప్రాక్టీస్ సెషన్లో చెమటలు కక్కిస్తున్నాడు గౌతీ. కోచ్‌గా తొలి సిరీస్‌లో టీమ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు. లంకను లైట్ తీసుకోకుండా.. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలనే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు. అయితే గంభీర్ కోచింగ్ చేయడం ఆపేయాలని భారత దిగ్గజ క్రికెటర్ సందీప్ పాటిల్ సూచించాడు. కోచింగ్ మానేసి.. ప్లేయర్లను హ్యాండిల్ చేయడం మీద ఫోకస్ పెట్టాలని అన్నాడు.
‘ఇండియన్ టీమ్‌కు కోచింగ్ ఇవ్వడం గంభీర్ పని కాదు. జట్టుకు సాయం చేయడమే అతడి వర్క్. టాప్ లెవల్ క్రికెట్లో సక్సెస్ అవ్వాలంటే ఇలాగే చేయాలి. ప్లేయర్ మేనేజ్మెంట్ మీద గౌతీ ఫోకస్ పెట్టాలి. అదే కోచ్‌గా అతడికి అతిపెద్ద సవాల్ కానుంది. ఐపీఎల్లో ఫ్రాంచైజీలకు పని చేసినప్పుడు అతడు ఈ విషయంలో విజయవంతం అయ్యాడు. దాన్నే టీమిండియాలో కూడా కంటిన్యూ చేస్తే చాలు. గంభీర్ సక్సెస్ అవుతాడనే నమ్మకం ఉంది’ అని సందీప్ పాటిల్ చెప్పుకొచ్చాడు. టాప్ లెవల్ క్రికెట్లో ఆటగాళ్లకు కొత్తగా నేర్పాల్సింది పెద్దగా ఉండదన్నాడు. కాబట్టి గౌతీ ఫోకస్ మొత్తం ప్లేయర్ల ఫిట్నెస్, ఎవర్ని ఏ మ్యాచ్‌లో బరిలో దించాలి లాంటి అంశాలపై పెడితే చాలన్నాడు సందీప్ పాటిల్. మరి.. కోచింగ్ ఇవ్వడం కంటే ప్లేయర్ మేనేజ్మెంట్పై గంభీర్ దృష్టి పెట్టాలనే వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Ex-chief selector Sandeep Patil shared his insights regarding Gautam Gambhir’s primary responsibility as the new head coach of the Indian cricket team.#SLvIND #TeamIndia #GautamGambhir #CricketTwitter pic.twitter.com/Py3DHcmIXP
— InsideSport (@InsideSportIND) July 26, 2024