iDreamPost
android-app
ios-app

ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్ర పోవాలి! ఇది తెలిస్తే ఇక డాక్టర్ అవసరం ఉండదు!

నేటి కాలంలో చాలా మంది నిద్ర లేమితో బాధపడుతున్నారు. శారీరక శ్రమ ఉన్నా కూడా మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలతో సతమతమౌతూ కునుకు తీయడం కష్టంగా మారింది. కొంత మంది దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. కానీ వైద్యుడ్ని సంప్రదించరు.

నేటి కాలంలో చాలా మంది నిద్ర లేమితో బాధపడుతున్నారు. శారీరక శ్రమ ఉన్నా కూడా మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలతో సతమతమౌతూ కునుకు తీయడం కష్టంగా మారింది. కొంత మంది దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. కానీ వైద్యుడ్ని సంప్రదించరు.

ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్ర పోవాలి! ఇది తెలిస్తే ఇక డాక్టర్ అవసరం ఉండదు!

మారుతున్న కల్చర్‌కు అనుగుణంగా పద్ధతులు కూడా మారిపోతున్నాయి. దీంతో ఆహారపు అలవాట్లే కాదు దైనందిక జీవితంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి నిద్ర. ఈ హడావుడి జీవితంలో చుట్టంలా తయారయ్యింది నిద్ర. బెడ్‌పై వాలంగానే కునుకు తీస్తున్నారంటే.. వాళ్లంత అదృష్టవంతులు మరొకరు లేరు అని చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో నిద్ర పట్టడం చాలా కష్టంగా మారింది. ఇదే ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. మానవుడికి స్లీపింగ్ చాలా ఇంపార్టెంట్. శరీరం, మనస్సును సక్రమంగా పనిచేయడానికి ఇది అవసరం. రోగ నిరోధక వ్యవస్థ మెరుగు పడటానికి, ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ఇది కీలకం. సరిగ్గా నిద్ర పోకపోతే హార్మోన్స్ ఇన్ బాల్స్ అయ్యి.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒకటి, రెండు రోజులు కునుకు తీయకపోతే.. పెద్ద ప్రాబ్లమ్ రాదు కానీ.. దీర్ఘకాలికంగా ఇదే కొనసాగితే.. శరీరం షెడ్డుకు వెళుతున్నట్లే. హృదయ సంబంధిత సమస్యలు, బీపీ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

 వ్యక్తిగత, వృత్తి సమస్యలతో సతమతమౌతూ చాలా మంది నిద్రకు దూరం అవుతున్నారు. ఒత్తిడి వల్ల నిద్ర పట్టడం లేదంటూ చెబతున్నారు తప్ప.. రెస్ట్ తీసుకోవడం లేదు. కానీ మంచిగా నిద్ర పోతే డాక్టర్ కూడా అవసరం లేదట. మరికొంత మంది నిద్ర పోకపోవడాన్ని పెద్దగా సమస్యగానే చూడటం లేదు. అయితే నిద్రలేమి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్యులు చెబుతున్నారు. నిద్ర మానసికంగా శరీరంలో ఎంతో ఉత్తేజాన్ని తెస్తుందని గ్రహించి.. జపాన్‌లో ఓ కంపెనీ ఆఫీసు వేళల్లో తమ ఉద్యోగులు నిద్రకు ఉపక్రమించేలా కొంత సమయాన్ని కేటాయించింది. చాలా మంది ఆ నిద్రపోతున్నామంటే పోతున్నాం అన్నట్లుగా ఉంది. లెక్కలు వేసుకుని కునుకు తీస్తుంటారు. వాస్తవానికి నిద్ర ప్రతి వయస్సు వారికి మారుతూ ఉంటుంది. అది తెలిస్తే అసలు వైద్యుడి వద్దకే వెళ్లనక్కర్లేదట.  మరీ అసలు ఎన్ని గంటలు పడుకోవాలి? ఏ వయస్సు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలంటే

అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుండి 3 నెలల చిన్నారుల వరకు సుమారు 14-17 గంటల నిద్ర అవసరం. అలాగే 4 నెలల నుండి 11 నెలల చిన్నారి 12-15 గంటల పాటు బజ్జోవాలి. సంవత్సరం నుడి 2 సంవత్సరాల పాపాయిలు.. 11-14 గంటలు నిద్రపోవాలట. ఇక మూడు ఏళ్ల నుండి 5 ఏళ్ల లోపు చిన్నారులు 10-13 గంటలు కునుకు తీస్తే మంచిది. 6 ఏళ్ల నుండి 12 ఏళ్ల లోపు చిన్నారులు 9 నుండి 12 గంటలు నిద్రపోవాలట. ఇక యుక్త వయస్సు వచ్చిన పిల్లలు అంటే 13-18 ఏళ్ల మధ్య ఉన్న యవ్వనస్తులు 8-10 గంటల వరకు నిద్రకు ఉపక్రమించాలి. అలాగే 18 నుండి 60 సంవత్సరాల లోపు వారంతా కూడా సుమారు 7 గంటల నుండి 9 గంటల వరకు పడుకోవాలట. 61 ఏళ్లకు పైబడిన వారు మాత్రం 7-8 గంటల పాటు కంటి మీద కును వేస్తే మంచిది. ఇది ఏ డాక్టర్ చెప్పని సీక్రెట్. ఇవి కేవలం సూచనలు మాత్రమే.  నిద్ర పట్టకపోతే వైద్యుణ్ని సంప్రదించడం మేలు.