iDreamPost
android-app
ios-app

తారక్ తో నీల్ ప్రయోగం.. తాత పాత్రలో జూనియర్ ఎన్టీఆర్?

  • Published Jul 26, 2024 | 7:44 PM Updated Updated Jul 26, 2024 | 7:44 PM

Jr NTR May Playing Old Man Character In Prashanth Neel Movie: ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మూవీ తొందర్లోనే పట్టాలెక్కనుందని చెబుతున్నారు. అయితే ఈ మూవీలో తారక్ తో ప్రశాంత్ నీల పెద్ద ప్రయోగమే చేయబోతున్నాడు అంటున్నారు.

Jr NTR May Playing Old Man Character In Prashanth Neel Movie: ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మూవీ తొందర్లోనే పట్టాలెక్కనుందని చెబుతున్నారు. అయితే ఈ మూవీలో తారక్ తో ప్రశాంత్ నీల పెద్ద ప్రయోగమే చేయబోతున్నాడు అంటున్నారు.

  • Published Jul 26, 2024 | 7:44 PMUpdated Jul 26, 2024 | 7:44 PM
తారక్ తో నీల్ ప్రయోగం.. తాత పాత్రలో జూనియర్ ఎన్టీఆర్?

జూనియర్ ఎన్టీఆర్– కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా మీద చాలానే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా ఈ మూవీ రెండు పార్టుల్లో వస్తున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 రిలీజ్ కాకుండానే భారీ నుంచి అతి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్ డేట్స్ తో తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు తారక్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు అంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పైగా అందులో తారక్ ఒక ప్రయోగం కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు.. ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా అనమాట.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు ‘వార్ 2’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మూవీ స్టార్ట్ అవుతుందని గట్టిగానే టాక్ వినిపిస్తోంది. అటు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీకి డ్రాగన్ అని పేరు పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో తారక్ తో ప్రశాంత్ నీల్ ఒక ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నాడు అంటున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో చూపించబోతున్నాడు అని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అందులో కూడా ఇంకో ట్విస్ట్ అయితే ఉందంట.

డ్రాగన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని మాఫియా డాన్ రోల్ లో చూపించబోతున్నాడు అని చెబుతున్నారు. మాఫియా బ్యాగ్ డ్రాప్ చుట్టూనే కథ ఉంటుందంట. అందులో కూడా తారక్ ని తాతా మనవడిగా చూపిస్తారట. అంటే తాత క్యారెక్టర్.. అటు మనవడి క్యారెక్టర్ లో తారక్ కనిపిస్తాడు. ఈ తాత పాత్ర కనిపించేది చాలా తక్కువ సమయమే అయినా కూడా.. ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుంది అంటున్నారు. అయితే 75 ఏళ్ల వృద్ధుడి పాత్రలో ఎన్టీఆర్ చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్ అని టాక్ అయితే నడుస్తోంది. ఇప్పటికే ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం కూడా చేసిన అనుభవం జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది. ఎలాంటి పాత్రలో అయినా తారక్ ఒదిగిపోతాడు. యాక్టింగ్ పరంగా తారక్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి తారక్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే ప్రయోగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet