iDreamPost
android-app
ios-app

భర్తను జైలు నుంచి తప్పించడం కోసం భార్య పోరాటం.. OTT లో ఫీల్ గుడ్ మూవీ

  • Published Jul 27, 2024 | 4:00 AM Updated Updated Jul 27, 2024 | 4:00 AM

OTT Movie Suggestion: కుటుంబం కోసం ఏమైనా చేసే వారు ఉంటారు. అందులోను ఓ మహిళ తలుచుకుంటే ఏమైనా చేయగలదని.. ఈ సినిమా చూస్తే అర్ధమౌతుంది. అసలు ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

OTT Movie Suggestion: కుటుంబం కోసం ఏమైనా చేసే వారు ఉంటారు. అందులోను ఓ మహిళ తలుచుకుంటే ఏమైనా చేయగలదని.. ఈ సినిమా చూస్తే అర్ధమౌతుంది. అసలు ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

  • Published Jul 27, 2024 | 4:00 AMUpdated Jul 27, 2024 | 4:00 AM
భర్తను జైలు నుంచి తప్పించడం కోసం భార్య పోరాటం.. OTT లో ఫీల్ గుడ్ మూవీ

కొన్ని సినిమాలు చూస్తేనే ఇన్స్పైర్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి సినిమాలు ఓటీటీ లో చాలానే ఉన్నాయి. అలాగే ఈ ప్లాట్ లో వచ్చిన సర్వైవల్ డ్రామాస్ చాలానే చూసి ఉంటారు. అలాగే ఓ మహిళ తన కుటుంబం కోసం ఏ విధంగా పోరాడింది.. ఫ్యామిలీ విషయానికొస్తే ఎంత వరకు ఓ మహిళ వెళ్తుంది అనేది కూడా ఎన్నో సినిమాలలో చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. ఖచ్చితంగా ప్రతి మహిళ చూడాల్సిన సినిమా ఇది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. నకుళ్ అనే అతను తన ఫ్యామిలీ తో కలిసి ఇంగ్లాండ్ లో జీవిస్తూ ఉంటాడు. నకుళ్ భార్య పేరు సావిత్రి.. వారిద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకుంటారు. వారికి ఓ బాబు కూడా ఉంటాడు. నకుళ్ ఓ కన్స్ట్రక్షన్ కంపనీలో వర్క్ చేస్తాడు. సావిత్రి ఓ ప్రమాదంలో తన కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుంటుంది. దీనితో అప్పటినుంచి కూడా భర్త, కొడుకే తన ప్రపంచంగా జీవిస్తూ ఉంటుంది. నకుళ్ వాళ్ళ నాన్నకు సావిత్రి అంటే చాలా ఇష్టం.. కన్న కూతురిలా చూసుకుంటూ ఉంటాడు. అంతా చక్కగా ఆనందంగా సాగిపోతుంది అనుకునే సమయంలో వారి జీవితాల్లోకి అనుకోని ప్రమాదం వచ్చి పడుతుంది. ఎందుకంటే నకుళ్ ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు. పోలీసులు ఇంటికి వచ్చి నకుళ్ ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. దీనితో సావిత్రికి ఏమి అర్ధం కాదు.

నకుళ్ పని చేస్తున్న కన్స్ట్రక్షన్ సైట్ లోని సూపర్ వైసర్ స్టేఫ్ని ని ఎవరో చంపేసి .. సైట్ లో పడేస్తారు. దీనితో నకుళ్ ను ఈ కేసులో అనుమానితుడిగా అనుకుని అతనిని అరెస్ట్ చేస్తాడు. తానూ ఈ మర్డర్ చేయలేదని.. ఎలాగైనా నిరూపించుకోవాలని అనుకుంటాడు. కానీ పరిస్థితులన్నీ కూడా అతనికి ప్రతికూలంగానే ఉంటాయి. పైగా వీరిద్దరికి అంతకుముందే ఓ గొడవ జరిగి ఉంటుంది. దీనితో అందరు ఈ మర్డర్ నకుళ్ చేసినట్లే ప్రూఫ్స్ ఉంటాయి. దీనితో సావిత్రికి ఏం చేయాలో ఏమి అర్థంకాదు. ఎలాగైనా అతనిని ఈ కేసు నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంటుంది. నకుళ్ కు కోర్టు పన్నెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. ఇక జైల్లో ఓ గ్యాంగ్ నకుళ్ ను బాగా కొడతారు. దీనితో అతనిని హాస్పిటల్ లో ఎడ్మిట్ చేస్తారు. అప్పుడు సావిత్రి దొంగతనంగా తన భర్తను జైలు నుంచి బయటకు తీసుకుని రావాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె తన భర్త కోసం ఎలా పోరాడింది ? భర్తను జైలు నుంచి బయటకు తీసుకుని రావడానికి.. ఎలాంటి ప్రయత్నాలు చేసింది ? చివరికి ఆమె అనుకున్నది సాదించిందా లేదా ? అనేది “సావి” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetboo girişgrandpashabet