iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 8లో పాల్గొనే సీరియల్ ఆర్టిస్ట్స్ వీరే! లిస్ట్ అదిరింది!

  • Published Jul 26, 2024 | 5:49 PM Updated Updated Jul 26, 2024 | 5:49 PM

Serial Artists List For Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దానిని డబుల్ చేస్తూ సీరియల్ ఆర్టిస్టుల లిస్ట్ వచ్చేస్తోంది. ఈ లిస్ట్ చూస్తే ఈ సీజన్ స్టార్ట్ కాకముందే కిరాక్ సక్సెస్ కొట్టేట్లు ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Serial Artists List For Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దానిని డబుల్ చేస్తూ సీరియల్ ఆర్టిస్టుల లిస్ట్ వచ్చేస్తోంది. ఈ లిస్ట్ చూస్తే ఈ సీజన్ స్టార్ట్ కాకముందే కిరాక్ సక్సెస్ కొట్టేట్లు ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  • Published Jul 26, 2024 | 5:49 PMUpdated Jul 26, 2024 | 5:49 PM
బిగ్ బాస్ 8లో పాల్గొనే సీరియల్ ఆర్టిస్ట్స్ వీరే! లిస్ట్ అదిరింది!

పాన్ ఇండియా లెవల్లో ఉన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏది అనగానే అంతా టక్కున బిగ్ బాస్ అనే చెప్తారు. ప్రారంభమైన ప్రతి భాషలో టాప్ షోగా దూసుకుపోతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ షోకి బుల్లితెర ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే తెలుగులో 7 సీజన్స్, ఒక ఓటీటీ సీజన్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8వ సీజన్ కు దాదాపుగా ముహూర్తం కూడా ఖరారు అయిపోయింది. ఎప్పటిలాగానే సెప్టెంబర్ లో స్టార్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లోగని కూడా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఎవరు అనే ప్రశ్న తరచూ వినిపిస్తోంది. అయితే ఈసారి సీరియల్ ఆర్టిస్టుల్లో ప్రముఖంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు దాదాపుగా వెళ్లి తీరతారు అంటూ బల్లగుద్ది చెబుతున్నారు.

నరేశ్ లొల్ల:

ఈ సీరియల్ ఆర్టిస్టు గురించి బిగ్ బాస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సిరీయల్స్ లో ఎలా అయితే తన నటనతో మెప్పించాడో.. గత బిగ్ బాస్ సీజన్ సమయంలో రన్నరప్ అమర్ దీప్ కోసం పోరాడి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు సంపాదించుకున్నాడు. తన మిత్రుడిని ట్రోల్ చేస్తున్న వారిపై ఒక మినీ యుద్ధమే చేశాడు. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. ఏ రకంగా ట్రోల్ చేసినా కూడా నిలబడి వాళ్లు అందరికీ సమాధానం చెప్పాడు. ఒకానొక సమయంలో ఇతనే ట్రోలర్స్ టార్గెట్ కూడా అయ్యాడు. అయినా ఒక ఫ్రెండ్ కోసం తన పోరాటాన్ని ఆపలేదు. ఇప్పుడు నేరుగా నరేశ్ లొల్ల బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నాడు అంటే.. ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కన్ఫామ్డ్ లిస్ట్ లో నరేశ్ లొల్ల పేరు కచ్చితంగా ఉంటుంది అంటున్నారు.

అక్షిత:

ఇంక తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కుంకుమ పువ్వు సీరియల్ గురించి.. అందులో లీడ్ రోల్ ప్లే చేసే అక్షిత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ సీరియల్ వల్ల అక్షిత మంచి పేరు రావడమే కాదు.. మంచి అభిమాన గణం కూడా తయారైంది. ఆమె యాక్టింగ్, క్యారెక్టర్లో చూపించే వేరియేషన్స్ కు తెలుగు సీరియల్ ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు అక్షిత పేరు దాదాపుగా ఖరారు అయిపోయింది అనే వార్తలు విని హ్యాపీగా ఫీలవుతున్నారు. మన ఫేవరెట్ సీరియల్ ఆర్టిస్ట్ ని ఇంక 24 గంటలు చూసేయచ్చు అంటూ సంబరపడిపోతున్నారు. సీరియల్ ఆర్టిస్టుల లిస్టులో దాదాపుగా అక్షిత పేరు కూడా కన్ఫామ్ అనే చెప్తున్నారు.

ప్రేరణ:

ఇంక ఈ లిస్ట్ లో మరో పేరుగా ప్రేరణ గురించి చెప్తున్నారు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో ఎంతో మంది తెలుగు సీరియల్ ప్రేక్షకులకు ప్రేరణ ఫేవరెట్ అయిపోయింది. సీరియల్ లోనే కాదు.. షోస్ లో కూడా తన అల్లరితో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. కృష్ణగా ఆ సీరియల్ మొత్తాన్ని తన భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టపోతోంది అంటున్నారు. ఆమె బయటే అంత అల్లరి చేస్తుంది.. ఇంక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ పక్కా అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. సీరియల్ ఆర్టిస్టుల కేటగిరీలో మాత్రం ఈ ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet