iDreamPost
android-app
ios-app

నేను లైఫ్ అస్సలు ఎంజాయ్ చేయలేదు! శ్రీ సత్య ఎమోషనల్ కామెంట్స్!

  • Published Jul 26, 2024 | 6:29 PM Updated Updated Jul 26, 2024 | 6:29 PM

వెండితెర నుండి బుల్లితెరపై మెరిసిన బ్యూటీ శ్రీ సత్య. బిగ్ బాస్ సీజన్ 6లో తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఇటీవల టిల్లు స్క్వేర్ లో కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూతో వార్తలో నిలిచింది. ఇదిలా ఉంటే..

వెండితెర నుండి బుల్లితెరపై మెరిసిన బ్యూటీ శ్రీ సత్య. బిగ్ బాస్ సీజన్ 6లో తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఇటీవల టిల్లు స్క్వేర్ లో కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూతో వార్తలో నిలిచింది. ఇదిలా ఉంటే..

  • Published Jul 26, 2024 | 6:29 PMUpdated Jul 26, 2024 | 6:29 PM
నేను లైఫ్ అస్సలు ఎంజాయ్ చేయలేదు! శ్రీ సత్య ఎమోషనల్ కామెంట్స్!

అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలు రావడం లేదు శ్రీ సత్యకు. ఇన్ని ఉన్నా అదృష్టం ఉండాలని అనుకుంటుంది ఈ బ్యూటీ. మోడలింగ్ రంగం నుండి బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెట్టింది. నేను శైలజ, గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్ వంటి సినిమాలు చేసినా లక్ లేకపోవడంతో బుల్లితెరపై మెరిసింది. నిన్నే పెళ్లాడతా, త్రినయని సీరియల్స్‌తో ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 6లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. 103 రోజుల పాటు హౌస్‌లో కొనసాగింది. బిగ్ బాస్ కూడా ఆమె ఫేట్ మార్చలేకపోయింది. తాజాగా టిల్లు స్క్వేర్‌లో నటించింది. ఈ మూవీలో కూడా ఫుల్ లెంత్ రోల్ చేయగా.. తెరపై తాను కనిపించింది కొన్ని నిమిషాలే అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా, ఈటీవీలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ షో నుండి కూడా క్విట్ అయ్యింది ఈ మాజీ మిస్ విజయవాడ.

అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు వెల్లడించింది. సీరియల్స్ చేస్తుండటంతోనే తనకు సినిమా ఆఫర్లు పోయాయని వాపోయింది. అలాగే ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా, హార్డ్ వర్క్ చేసినా అదృష్టం ఉండాలని చెప్పింది. తనను ఆడిషన్‌కు పిలిచి తెల్లగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, చిన్న పిల్లలా కనిపిస్తున్నావు అంటూ రిజక్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న పిల్లలా కనిపించకుండా ఉండేందుకు లిప్ ఫిల్లర్ చేయించుకున్నట్లు తెలిపింది. అయితే తాజాగా మరోసారి ట్రెండింగ్ అవుతోంది. తన లైఫ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది శ్రీ సత్య. అంతా అనుకున్నట్లు తాను డబ్బు మనిషిని కాదని పేర్కొంది.  తాను పడుతున్న ఇబ్బందులు గురించి చెప్పింది. మూవీస్‌కు వెళ్దామని సీరియల్స్ ఆపేసినట్లు చెప్పింది.

బిగ్ బాస్‌కు వెళ్లిందే కెరీర్ గ్రోత్ కోసమని, అందుకే సీరియల్ చేయట్లేదని తెలిపింది. అలాగే తన అమ్మ కోసం కొన్ని షోస్ ఒప్పుకుంటున్నట్లు తెలిపింది. ‘జనాలు అందరూ అనుకుంటారు డబ్బు మనిషి అని. నేను బాధల్లో ఉన్నానంటే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. తినడానికి కూడా ఫ్రీగా ఫుడ్‌ ఎవరు ఇవ్వరు. కానీ డబ్బు అందరికీ ఇంపార్టెంటే. కానీ ఒప్పుకోరంతే. అలా చెప్పిన వాళ్లు బ్యాడ్ అవుతుంటారు. మమ్మీ చికిత్సకు ఆమెకు నెలకు రూ.లక్షకు పైగా ఖర్చవుతుంది. కారు కొనడానికి నా వద్ద డబ్బుల్లేవు. 2019లో ఓ చిన్న కారు కొనుక్కున్నా. అది పాడయిపోవడంతో ఎక్కువ ఖర్చవుతుందని అమ్మేశా. ఇప్పటికీ నా వద్ద కారు లేదు. ఎందుకంటే వచ్చిన డబ్బులన్నీ అమ్మ ఆసుపత్రి ఖర్చులకే సరిపోతాయి. నేను నా లైఫ్ లో ఎంజాయ్ చేయలేదు. నాకు ఎంజాయ్ మెంట్ అవసరం. కానీ కొంత మంది ఎక్కడికైనా వెళితే ఎవడో తీసుకెళుతున్నాడు’అని అంటుంటారు అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom