iDreamPost
android-app
ios-app

విమానంలో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం.. వీడియో వైరల్

  • Published Jul 26, 2024 | 8:15 PM Updated Updated Jul 26, 2024 | 8:15 PM

ఇండస్ట్రీకి చెందిన నటీ, నటులకు అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుండటం కామన్ . అయితే వాటిలో కొన్ని లైట్ తీసుకునే అనుభవాలే కాకుండా.. చిరాకు తెప్పించే అనుభవాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరో కూతురు క్రేజీ హీరోయిన్ కు ఫ్లైట్ లో ఓ చేదు అనుభవం ఎదురైంది. కానీ, దీనిపై ఆ బ్యూటీ ఏ విధంగా స్పందించకుండా మౌనంగా ఉండిపోయింది. ఇంతకి ఆమె ఎవరంటే..

ఇండస్ట్రీకి చెందిన నటీ, నటులకు అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుండటం కామన్ . అయితే వాటిలో కొన్ని లైట్ తీసుకునే అనుభవాలే కాకుండా.. చిరాకు తెప్పించే అనుభవాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరో కూతురు క్రేజీ హీరోయిన్ కు ఫ్లైట్ లో ఓ చేదు అనుభవం ఎదురైంది. కానీ, దీనిపై ఆ బ్యూటీ ఏ విధంగా స్పందించకుండా మౌనంగా ఉండిపోయింది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Jul 26, 2024 | 8:15 PMUpdated Jul 26, 2024 | 8:15 PM
విమానంలో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం.. వీడియో  వైరల్

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీ, నటులకు సినిమాల్లోనే కాదు.. బయట కూడా అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అయితే వీటిలో కొన్ని అనుభవాలు లైట్ తీసుకునే విధంగా ఉంటే.. మరి కొన్ని మాత్రం కోపం తెప్పించే విధంగా ఉంటాయి. దీంతో చాలామంది నటీ,నటులు ఒక్కోసారి కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది కలిగించిన వారిపై సీరియస్ అవుతుంటారు. మరీ, కొంతమంది చేయి కూడా చేసుకుంటారు. కానీ, కొందరు మాత్రం తమకి ఎదురైన చేదు అనుభవం పై కోపం వచ్చినా.. అవతలి వారిని ఏమీ అనలేక మౌనంగా ముందుకు కదులుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరో కూతురు, క్రేజీ హీరోయిన్ కూడా తాను ప్రయాణించిన  ఫ్లైట్ లో చేదు అనుభవం ఎదురైంది. కానీ, దీనిపై ఆ బ్యూటీ ఏ విధంగా స్పందించకుండా మౌనంగా ఉండిపోయింది. ఇంతకి ఆమె ఎవరంటే..

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ‘సారా అలీఖాన్’.. ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే.. బాలీవుడ్ స్టార్ హీరో  సైఫ్ అలీఖాన్ కూతురిగా  బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘సింబా’ మూవీతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక తొలి సినిమాతోనే మంచి నటిగా పేరు సంపాదించుకున్న ఈ చిన్నది ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కాగా, ఇటీవలే ‘మర్డర్ ముభారక్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మకు విమానంలో  ఓ  చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇటీవలే సారా అలీఖాన్ ఓ ఫ్లైట్‌లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే.. ఆమె ఫ్లైట్‌లో తన సీట్‌లో కూర్చొని ఉండగా.. ఆ సమయంలో ఎయిర్ హోస్టెస్ సారాకు జ్యూస్ ఇచ్చేందుకు వచ్చింది. కానీ, ఆ జ్యూస్ కాస్త పొరపాటుగా ఆమె మీద పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు పైలెట్లు ఆమె సీట్ దగ్గర వచ్చారు. పైగా . ఎయిర్ హోస్టెస్ కూడా అక్కడే ఉంది. అయితే ఇంపార్టెంట్ పని మీద వెళ్తుండగా.. ఇలా తనకు చేదు అనుభవం ఎదురవ్వడంతో సారా వారిపై సీరియస్ గా చూస్తూ తన సీట్నుంచి లేచి వాష్ రూమ్ కు వెళ్లిపోయింది.

కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ పొరపాటున జరిగింది కావొచ్చు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తుండగా.. మరి కొంతమంది మాత్రం అక్కడ జరిగింది నిజం కాదాని, అదాంత సినిమా ప్రమోషన్స్ లో ఆడిన నాటకం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సారా చేతుల్లో కొత్త ప్రాజెక్ట్ ఏమీ లేకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే.. సోషల్ మీడియాలో తన గ్లామరెస్ ఫోటోస్ పెడుతూ అందర్నీ మంత్ర ముగ్ధులను చేస్తుంది. మరీ, సారాకు ఎదురైన చేదు అనుభవం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş