iDreamPost
android-app
ios-app

New Rules: ఆగస్టు 1 నుంచి మారుతున్న రూల్స్‌ ఇవే.. తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు

  • Published Jul 27, 2024 | 12:00 AMUpdated Jul 27, 2024 | 12:00 AM

From August 1st 2024 These Rules Changed: మరి కొన్ని రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభం కానుంది. ఇక నెల మారింది అంటే.. ఆర్థికపరమైన అంశాలు సహా కొన్నింటిలో మార్పులు వస్తాయి. మరి ఆగస్టు నుంచి ఏమేం మారబోతున్నయో ఇప్పుడు తెలుసుకుందాం.

From August 1st 2024 These Rules Changed: మరి కొన్ని రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభం కానుంది. ఇక నెల మారింది అంటే.. ఆర్థికపరమైన అంశాలు సహా కొన్నింటిలో మార్పులు వస్తాయి. మరి ఆగస్టు నుంచి ఏమేం మారబోతున్నయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jul 27, 2024 | 12:00 AMUpdated Jul 27, 2024 | 12:00 AM
New Rules: ఆగస్టు 1 నుంచి మారుతున్న రూల్స్‌ ఇవే.. తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు

సాధారణంగా నెల ప్రారంభం, కొత్త ఏడాది మొదలు కాగానే.. పలు ఆర్థికపరమైన అంశాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటుంటాయి. కొత్త రూల్స్‌ తెర మీదకు వస్తాయి.. పాతవి కనుమరుగవుతాయి. కొన్నింటి ధరలు పెరుగుతాయి. ఇక సాధారణంగా నెల ప్రాంరభం కాగానే చమురు కంపెనీలు గ్యాస్‌ సిలిండర్‌ ధరలపై నిర్ణయం తీసుకుంటాయి. అంటే డొమెస్టిక్‌, గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచడం లేదా తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే క్రెడిట్‌ కార్డ్స్‌, డెబిట్‌ కార్డ్స్‌ వంటి వాటికి సంబంధించి కొత్త రూల్స్‌ అమల్లోకి వస్తాయి. అయితే ఈ సారి ఆగస్ట్‌ నెల ప్రాంరభానికి ముందు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. దీని వల్ల అనేక అంశాలు మారనున్నాయి. మరి ఏమేం మారనున్నాయో తెలుసుకోకపోతే.. మీ జేబుకు భారీ చిల్లు పడనుంది అంటున్నారు. ఆవివరాలు..

సాధారణంగా నెల ప్రారంభం కాగానే.. ముందుగా మారేది గ్యాస్‌ సిలిండర్‌ ధర. కేంద్ర ప్రభుత్వం గతంలో రెండు సార్లుగా గృహ అవసరాలకు వాడే గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించింది. అప్పటి నుంచి అది స్థిరంగానే ఉంటుంది. ఇక కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర విషయానికి వస్తే.. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించింది. ఈసారి కూడా సిలిండర్‌ రేటును తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్..

క్రెడ్‌, చెక్‌, మొబిక్విక్‌, ఫ్రీచార్జ్‌, ఇతర సేవలను ఉపయోగించి చేసే రెంటల్‌ చెల్లింపుల లావాదేవీల మొత్తం మీద 1 శాతం ఛార్జ్ ఉంటుంది. ఇది గరిష్టంగా రూ.3000 ఉండనుంది. రూ.15,000 లోపు ఫ్యూయల్‌ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. అయితే రూ.15,000 కంటే ఎక్కువ లావాదేవీలపై మాత్రం 1 శాతం ఉండనుంది. అది గరిష్టంగా రూ.3000 వరకు ఉండనుంది.

రూ.50,000 లోపు యుటిలిటీ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. రూ.50,000 పైబడిన లావాదేవీలపై మాత్రం 1 శాతం లేదా గరిష్టంగా రూ.3000 ఛార్జీ విధిస్తారు. అయితే బీమా లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కాలేజీ, స్కూల్‌ వెబ్‌సైట్‌లు లేదా వారి పీఓఎస్‌ మెషీన్‌ల ద్వారా నేరుగా చేసే చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ క్రెడ్‌, చెక్‌, మొబిక్విక్‌ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే చేస్తే ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.3000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

ఆలస్య చెల్లింపు ఛార్జీల్లోనూ ఆర్బీఐ అనేక సవరణలు చేసింది. ఏదైనా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఈజీ-ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే గరిష్టంగా రూ.299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. వీటితో పాటు మరి కొన్ని అంశాలు కూడా మారతాయి అంటున్నారు. వీటన్నింటిని తెలుసుకోకుండా లావాదేవీలు జరిపితే.. జేబుకు చిల్లుపడే అవకాశం ఉంది అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి