iDreamPost
android-app
ios-app

ఫ్రెండ్ తో కీర్తి సురేశ్ పెళ్లి? ఆమె ఏమన్నారంటే?

  • Published Jul 26, 2024 | 6:22 PM Updated Updated Jul 26, 2024 | 6:22 PM

Keerthy Suresh Clarity on Marriage Rumors: తన చిన్ననాటి ఫ్రెండ్ ను స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతోందని కొన్ని రోజులుగా వార్త హల్ చల్ చేస్తోంది. ఈ విషయంపై లేటెస్ట్ గా రియాక్ట్ అయ్యింది ఈ బ్యూటీ. ఆమె ఏమన్నదంటే?

Keerthy Suresh Clarity on Marriage Rumors: తన చిన్ననాటి ఫ్రెండ్ ను స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతోందని కొన్ని రోజులుగా వార్త హల్ చల్ చేస్తోంది. ఈ విషయంపై లేటెస్ట్ గా రియాక్ట్ అయ్యింది ఈ బ్యూటీ. ఆమె ఏమన్నదంటే?

  • Published Jul 26, 2024 | 6:22 PMUpdated Jul 26, 2024 | 6:22 PM
ఫ్రెండ్ తో కీర్తి సురేశ్ పెళ్లి? ఆమె ఏమన్నారంటే?

ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు సంబంధించి ఎన్నోరకాల వార్తలు వైరల్ గా మారుతూ ఉంటాయి. అందులో ఎక్కవగా పెళ్లి, డేటింగ్, విడాకులు లాంటి రూమర్లే ఉంటాయి. ఇక ఇలాంటి న్యూస్ పై స్పందించడానికి వారు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ తరచుగా అదే ప్రశ్న ఎదురైతే మాత్రం తప్పకుండా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితినే  గత కొంతకాలంగా ఫేస్ చేస్తూ వస్తోంది స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్. తన చిన్ననాటి ఫ్రెండ్ ను ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతోందని కొన్ని రోజులుగా వార్త హల్ చల్ చేస్తోంది. ఈ విషయంపై లేటెస్ట్ గా రియాక్ట్ అయ్యింది ఈ బ్యూటీ.

కీర్తి సురేశ్.. మహానటితో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాలో నటనకు గాను అవార్డులతో పాటుగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని ఓ రేంజ్ కి వెళ్లిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ నటించిన ‘రఘు తాత’ ఆగస్ట్ 15న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సంస్థ నిర్మించిన తొలి తమిళ చిత్రం ఇది. దృఢసంకల్పం ఉన్న ఓ మహిళ చేసే స్పూర్తిదాయకమైన పోరాటాన్ని ఈ మూవీలో చూపించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది కీర్తి సురేశ్. తాజాగా అభిమానులతో ముచ్చటించించి కీర్తి. ఈ సందర్భంగా చిన్న నాటి స్నేహితుడిని పెళ్లాడుతున్నాడన్న వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది.

కీర్తి సురేశ్ మాట్లాడుతూ..”రూమర్లపై నేను స్పందించను. ఎందుకంటే? ఏదైనా రూమర్ పై క్లారిటీ ఇస్తే.. అది నిజమని అందరూ భావిస్తారు. అయితే నా నటన, సినిమాల గురించి విమర్శలు చేస్తే.. వాటిని తప్పకుండా స్వీకరిస్తాను. ఆ విమర్శల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. అంతే తప్ప ఇలా వ్యక్తిగత, కుటుంబ విషయాల గురించి కామెంట్స్ చేస్తే.. వాటిని అస్సలు పట్టించుకోను. వాళ్లు చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పటికైనా ఈ పెళ్లి వార్తలు ఆగుతాయో.. లేదో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom