iDreamPost
android-app
ios-app

అనుష్క కోసం పెళ్లికొడుకు రెడీ? స్వీటీ గ్రీన్ సిగ్నల్ కోసమే వెయిటింగ్!

  • Published Jul 26, 2024 | 8:35 PM Updated Updated Jul 26, 2024 | 8:35 PM

Again Gossips On Anushka Shetty Marriage: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటున్నారు. కుటుంబ సభ్యులు ఒక సంబంధం కూడా వెతికి పెట్టారని చెబుతున్నారు. స్వీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అంటున్నారు.

Again Gossips On Anushka Shetty Marriage: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటున్నారు. కుటుంబ సభ్యులు ఒక సంబంధం కూడా వెతికి పెట్టారని చెబుతున్నారు. స్వీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అంటున్నారు.

  • Published Jul 26, 2024 | 8:35 PMUpdated Jul 26, 2024 | 8:35 PM
అనుష్క కోసం పెళ్లికొడుకు రెడీ? స్వీటీ గ్రీన్ సిగ్నల్ కోసమే వెయిటింగ్!

అనుష్కా శెట్టి.. ఈ అమ్మడుకి పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో హీరోయిన్ గా చేసి సినిమా ప్రేక్షకులను అలరించింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు అయితే ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనుష్కా.. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా మంచి పేరు సంపాదించుకుంది. బాహుబలి సిరీస్ తో అనుష్క కెరీర్ లోనే టాప్ ప్లేస్ కి వెళ్లిపోయింది. ప్రయోగాలు చేయడంలో కూడా స్వీటీ ముందు వరసలోనే ఉంటుంది.

అనుష్క ఇప్పుడు కెరీర్ లో ఇప్పుడు కాస్త ఆలోచించి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు కథనార్ పేరిట మలయాళంలో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ మూవీ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం ప్రాజెక్ట్స్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. అనుష్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పుడూ ఒక ప్రశ్న వినిపిస్తూనే ఉంటుంది. అదేంటంటే.. అనుష్క పెళ్లి ఎప్పుడు? ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో ఈ ప్రశ్న గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతూనే ఉంటాయి. అప్పట్లో అనుష్క పెళ్లి ఫిక్స్ అయింది అని కూడా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం గాసిప్స్ అనే విషయం తర్వాత అర్థమైంది. ఇప్పుడు మరోసారి స్వీటీ పెళ్లి విషయం తెరపైకి వచ్చింది.

ఇప్పుడు కాస్త గట్టిగానే వార్తలు వస్తున్నాయి. అది కూడా పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు అంటూ చెబుతున్నారు. ప్రస్తుతం అనుష్క వయసు 42 సంవత్సరాలు. ఇంట్లో వాళ్లు కూడా పెళ్లి విషయంలో కంగారు పెడుతున్నారు అంటూ చెబుతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు సంబంధాలు వెతికో పనిలో మునిగిపోయారు అంట. అందులో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్ సంబంధం ఫ్యామిలీకి బాగా నచ్చింది అంటున్నారు. అలాగే అతను కూడా అనుష్కను వివాహం చేసుకోవడానికి రెడీగా ఉన్నాడని చెబుతున్నారు. అయితే స్వీటీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు అనేది ఈ వార్తల సారాంశం. వస్తున్న వార్తలను బట్టి చూస్తే.. అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు? అసలు ఇదంతా నిజంగానే నిజమా అంటే? అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ నమ్మే పరిస్థితి లేదు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet