iDreamPost
android-app
ios-app

OTT Horror Thriller : డైరెక్ట్ గా OTT లోకి వచ్చేసిన అవికా హర్రర్ మూవీ.. భయంతో వణికిపోవాల్సిందే

  • Published Jul 27, 2024 | 1:00 AM Updated Updated Jul 27, 2024 | 1:00 AM

ఇప్పుడు ఓటీటీ లో హర్రర్ సినిమాల క్రేజ్ ఎలా నడుస్తుందో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో తాజాగా మరొక హర్రర్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఇప్పుడు ఓటీటీ లో హర్రర్ సినిమాల క్రేజ్ ఎలా నడుస్తుందో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో తాజాగా మరొక హర్రర్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jul 27, 2024 | 1:00 AMUpdated Jul 27, 2024 | 1:00 AM
OTT Horror Thriller : డైరెక్ట్ గా OTT లోకి వచ్చేసిన అవికా హర్రర్ మూవీ.. భయంతో వణికిపోవాల్సిందే

శుక్రవారం వచ్చిందంటే అటు థియేటర్స్ తో పాటు ఇటు ఓటీటీ లలోను వరుస సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడైతే చాలా మంది వెండి తెర నటీ నటులు కూడా.. ఓటీటీ లవైపే మొగ్గు చూపిస్తున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఓటీటీ లో హర్రర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ నడుస్తుందో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే అవికా గోర్ మెయిన్ లీడ్ లో నటించిన హర్రర్ థ్రిల్లర్ “బ్లడీ ఇష్క్”. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

అవికా గోర్ అటు వెండి తెరపై ప్రాజెక్ట్స్ తో పాటు.. ఇటు ఓటీటీ ప్రాజెక్ట్స్ ను కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె నటించిన తాజా హర్రర్ థ్రిల్లర్ బ్లడీ ఇష్క్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 26 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు హర్రర్ మూవీకి.. హర్రర్ చిత్రాల స్పెషల్ డైరెక్టర్.. విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పటినుంచి.. బాగానే బజ్ క్రియేట్ అయింది. దీనితో ఈ హర్రర్ పిక్చర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ మూవీ హిందీ వెర్షన్ మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. కానీ త్వరలో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఇక బ్లడీ ఇష్క్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీలో అవికా గోర్ ఓ ఘటన వలన తన గతాన్ని మర్చిపోతుంది. దీనితో ఆమె భర్త తనను స్కాట్ ల్యాండ్ లోని ఓ ఐలాండ్ పై ఉన్న ఓ పెద్ద భవనానికి తీసుకుని వెళ్తాడు. ఆమె ఎందుకు తన గతం మర్చిపోయిందో ఎలా మర్చిపోయిందో ఆమె భర్త అంతా క్లియర్ గా చెప్తాడు. ఆ తర్వాత ఆమెకు ఆ ఇంట్లో కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురౌతాయి. ఆ ఇంట్లో దెయ్యం ఉన్నట్లు.. ఆ దెయ్యం ఆమెను చంపడానికి వస్తున్నట్లు.. భయపడుతుంది. ఆమె భయమే నిజం అవుతుంది. ఆమెను చంపాలని నిజంగానే ఓ దెయ్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. అసలు ఆ దెయ్యం ఎవరు ? ఆమె గతం ఏంటి ? అవికా దీని నుంచి ఎలా బయటకు వచ్చింది అనేదే ఈ మూవీ కథ. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpir girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş