iDreamPost
android-app
ios-app

Sakshi Shivanand: 90ల్లో యూత్ క్రష్ సాక్షి శివానంద్.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూడండి

  • Published Jul 26, 2024 | 11:00 PM Updated Updated Jul 26, 2024 | 11:00 PM

Sakshi Shivanand 90ల్లో సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీ పరిశ్రమను మడతపెట్టేసిన హీరోయిన్లలో ఒకరు సాక్షి శివానంద్. చిరంజీవి మాస్టర్ మూవీతో ఒక్కసారిగా కుర్రాళ్ల క్రష్ అయిన ఈ బ్యూటీ..అనతి కాలంలోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. సింహరాశి తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. ప్రస్తుతం ఈ నటి ఎంతలా మారిపోయిందంటే...

Sakshi Shivanand 90ల్లో సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీ పరిశ్రమను మడతపెట్టేసిన హీరోయిన్లలో ఒకరు సాక్షి శివానంద్. చిరంజీవి మాస్టర్ మూవీతో ఒక్కసారిగా కుర్రాళ్ల క్రష్ అయిన ఈ బ్యూటీ..అనతి కాలంలోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. సింహరాశి తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. ప్రస్తుతం ఈ నటి ఎంతలా మారిపోయిందంటే...

  • Published Jul 26, 2024 | 11:00 PMUpdated Jul 26, 2024 | 11:00 PM
Sakshi Shivanand: 90ల్లో యూత్ క్రష్ సాక్షి శివానంద్.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూడండి

ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు అలా వచ్చి ఎంటర్ టైన్ ఇలా వెళ్లిపోతుంటారు. కానీ ప్రేక్షకుల మనస్సులపై చెరగని ముద్ర వేస్తుంటారు. ఇలాంటి హీరోయిన్లు నటనా రంగం నుండి తప్పకున్నా.. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే చూడాలని అనుకుంటారు. వారిలో ఒకరు సాక్షి శివానంద్. అందమైన రూపం, చక్కటి చిరునవ్వు, మంచి ఫెర్మామెన్స్‌తో టాలీవుడ్‌లో త్వరగానే పాతుకుపోయింది. చాలా మంది ఆమె తొలి సినిమా మాస్టర్ అనుకుంటారు కానీ కాదు.. 1993లోనే అన్నా వదిన అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కృష్ణం రాజు, జయప్రద హీరో హీరోయిన్లు.  కాగా, ఆమె యంగ్ హీరోతో జతకట్టింది. మేనక అనే పేరుతో ఇంట్రడ్యూస్ అయ్యింది. తర్వాత హిందీ పరిశ్రమకు వెళ్లిపోయింది. అక్కడ సక్సెస్ అందుకున్నాక.. చిరంజీవి మూవీ మాస్టర్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది.

‘ఇంటిలోకి వెల్కమంటూ డోరు తీసినాడు మాస్టారూ’ సాంగ్‌లో సాక్షి అప్పీయరెన్స్, ఆమె క్యూటెనెస్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. 90స్ లో తన సినిమాలతో దుమ్ము దులిపేసిన స్టార్ హీరోయిన్ ఈమె. అప్పటి కుర్రాళ్లకు ఈమె నేషనల్ క్రష్. మాస్టర్ తర్వాత ఆమె ప్రీయారిటీ మారింది. తెలుగులో వరుస ఆఫర్లు రావడంతో హిందీ ఇండస్ట్రీని కాస్తంత పక్కకు పెట్టింది. తెలుగులో కలెక్టర్ గారు.. రాజ హంస, నిధి వంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. జస్ట్ ఫర్ ఛేంజ్ కోసం ఓ మలయాళ, హిందీ మూవీ చేసి.. మళ్లీ టీటౌన్‌పై దృష్టి సారించింది. స్నేహితులు తర్వాత ఆమె ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత స్టార్ హీరోస్ సరసన యాక్ట్ చేసింది. చిరంజీవితో కలిసి ఇద్దరు మిత్రులు చేసింది. ఆ మూవీ కూడా హిట్ అందుకుంది. సముద్రం, సీతారామ రాజు, పెళ్లివారమండి చిత్రాలు ఓకే అనిపించాయి.

మంచు మోహన్ బాబుతో యమజాతకుడు, బాలకృష్ణతో వంశోద్దారకుడు, మహేష్ బాబుతో యువరాజు వంటి చిత్రాల్లో నటించింది. మా పెళ్లికి రండి, పెళ్లి సంబంధం తీవ్ర నిరాశ పరిచాయి. ఆ సమయంలో వచ్చిందే సింహ రాశి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత కన్నడ, హిందీపై ఫోకస్ పెంచింది. తెలుగులో హోమం, రంగ ది దొంగ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ చేసింది. తర్వాత ఆమె వెండితెర నుండి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె చేస్తుందో, ఎక్కడ ఉందో అప్డేట్ లేదు కానీ.. ఆమె సోదరి, నటి ఓహానా ఆనంద్ అలియాస్ శిల్పా శివానంద్ తన సోషల్ మీడియాలో తన ఫోటోలతో పాటు తన సోదరి ఫోటోలను పంచుకుంటుది. అయితే ఇప్పటికి సాక్షి శివానంద్ అంతే అందంతో మెస్మరైజ్ చేస్తుంది. శిల్పా, సాక్షి శివానంద్ ఇద్దరూ మంచు ఫ్యామిలీ హీరోలతో నటించారు. 90లో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో.. ఈ బ్యూటీ కూడా రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet