iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్‌లోకి ఆ క్రేజీ హీరో… 13 ఏళ్ల తర్వాత

  • Published Jul 26, 2024 | 6:36 PM Updated Updated Jul 26, 2024 | 6:36 PM

స్మాల్ స్క్రీన్ పై ఎంటర్ టైన్ చేస్తున్న షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఎనిమిదో వర్షన్ రాబోతుంది. దీని కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఆ క్రేజీ హీరో రాబోతున్నాడట.

స్మాల్ స్క్రీన్ పై ఎంటర్ టైన్ చేస్తున్న షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఎనిమిదో వర్షన్ రాబోతుంది. దీని కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఆ క్రేజీ హీరో రాబోతున్నాడట.

  • Published Jul 26, 2024 | 6:36 PMUpdated Jul 26, 2024 | 6:36 PM
బిగ్ బాస్‌లోకి ఆ క్రేజీ హీరో… 13 ఏళ్ల తర్వాత

బుల్లితెరపై ఎంటర్ టైన్ మెంట్‌కు కొదవే లేదు. ఓ వైపు సీరియల్స్, సినిమాలు సందడి చేస్తుంటే.. మరో వైపు కొన్ని ప్రత్యేకమైన షోలు ఆకట్టుకుంటున్నాయి. డ్యాన్స్, కామెడీ షోలతో పాటు గేమ్ షోస్ అలరిస్తున్నాయి. అలాగే ఏడాదికి ఒకసారి పలకరించే రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఎనిమిదో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. టాస్కులు, గొడవలు, కాంట్రవర్సీలతో షో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. సీజన్ 8 పగడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. తాజాగా కీలక అప్టేడ్ ఇచ్చాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. సీజన్ 8కు సంబంధించిన లోగోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఇదిలా ఉంటే.. నెక్ట్స్ మంత్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ నుండి ఈ రియాలిటీ షో స్టార్ట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల వేట మొదలైనట్లు తెలుస్తుంది.

ఇప్పటికే పలువురు పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. నటీనటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సీరియల్ యాక్టర్స్ తీసుకురాబోతున్నారు. ఈ మధ్య కాలంలో లైమ్ లైట్స్ లో నిలిచిన వాళ్లను తీసుకురావాలని భావిస్తున్నారట. యాంకర్ వర్షిణి, కుమారీ ఆంటీ, బర్రెలక్క, వేణు స్వామి పేర్లతో పాటు బంచిక్ బబ్లు, రాజ్ తరుణ్, సోనియా సింగ్, హేమ, ఫార్మింగ్ నేత రాబోతున్నారని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. జబర్థస్త్ నరేశ్, సుప్రీత, కిరాక్ ఆర్పీ, కుషిత కల్లపు, బుల్లెట్ భాస్కర్, అమృత ప్రణయ్, రీతూ చౌదరి పేర్లు వెల్లడించాడు. కానీ ఇంకా కంటెస్టెంట్లు ఫైనల్ కాలేదని, చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు మరో హీరో పేరు గట్టిగానే వినిపిస్తుంది. తొలి మూవీతో అమ్మాయిల చూపు తన వైపు తిప్పుకున్న అబ్బాస్. 90స్ అమ్మాయిలకు అతడో క్రష్. తన హెయిర్ స్టైల్, బబ్లీ ఫేస్ కట్‌తో ఆకర్షించేవాడు.

ఒకప్పుడు స్టార్ హీరోగా మారిన అబ్బాస్.. తర్వాత సినిమా కథల ఎంపికలో పొరపాట్ల వల్ల వెనుకబడ్డాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. ప్రియా ఓ ప్రియాతో తెలుగులో అడుగు పెట్టిన ఈ హ్యాండ్సమ్ హీరో.. రాజ హంస, రాజా, అనగనగా ఓ అమ్మాయి, కృష్ణ బాబు, అల్లుగారు వచ్చారు, నీ ప్రేమకై, శ్వేత నాగు, పొలిటికల్ రౌడీ, చంద్ర హాస్, అనసూయ, ఇది సంగతీ, బ్యాంక్, రామ్ దేవ్, మారో వంటి చిత్రాలు చేశాడు. అయితే సినిమాలు డిజాస్టర్ కావడంతో పాటు ఆర్థిక సమస్యలు వెంటాడుతుండటంతో సినిమాల నుండి తప్పుకున్నాడు. తర్వాత న్యూజిలాండ్ వెళ్లి సెటిల్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఇండియా వచ్చి వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ప్రస్తుతం మోటివేషన్ స్పీకర్‌గా మారాడు అబ్బాస్. ఇప్పుడు ఈ స్టార్ హీరోను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ మేకర్స్. ఇదే నిజమైతే 13 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లే.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio