iDreamPost
android-app
ios-app

స్వాతిముత్యం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా మారిపోయడంటే?

  • Published Jul 27, 2024 | 6:00 AM Updated Updated Jul 27, 2024 | 6:00 AM

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, రాధిక జంటగా నటించిన స్వాతిముత్యం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పటికీ ఈ సినిమా అందరికీ ఆల్ టైమ్ ఫెవరెట్ అనే చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా,రాధిక కొడుకుగా నటించిన ఈ అబ్బాయి గుర్తున్నాడా.. ఇప్పుడేలా మారిపోయడంటే..

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, రాధిక జంటగా నటించిన స్వాతిముత్యం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పటికీ ఈ సినిమా అందరికీ ఆల్ టైమ్ ఫెవరెట్ అనే చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా,రాధిక కొడుకుగా నటించిన ఈ అబ్బాయి గుర్తున్నాడా.. ఇప్పుడేలా మారిపోయడంటే..

  • Published Jul 27, 2024 | 6:00 AMUpdated Jul 27, 2024 | 6:00 AM
స్వాతిముత్యం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా మారిపోయడంటే?

చాలామంది యాక్టర్స్ సినీ ఇండస్ట్రీలో బాలనటులు గానే ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే అలా ఎంట్రీ ఇచ్చిన వారు చేసినవి ఒకటి రెండు సినిమాలు అయినా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. వారి నటనతో అందర్నీ మంత్ర ముగ్ధులను చేస్తారు. కానీ, ఆ తర్వాత పూర్తిగా సినిమాల్లో కనిపించకుండా మాయమవుతారు. ఇలా ఇప్పటికే ఇండస్ట్రీలో బాల నటులుగా మెప్పించి ఆ తర్వాత కనుమరగైన యాక్టర్స్ ను మనం మిస్ అవుతున్నాం అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ యాక్టర్ కూడా ఒకరు. పై ఫోటోలో స్వాతిముత్యం సినిమాలో నటించిన ఈ అబ్బాయి గుర్తున్నడా.. ఇప్పుడేలా మారిపోయడంటే..

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన నటించిన సినిమాల్లో ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సినిమా ‘స్వాతిముత్యం’ కూడా ఒకటి. కాగా, ఈ సినిమాను డైరెక్టర్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఇక ఇందులో రాధిక శరత్ కుమార్, నిర్మలమ్మ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ ఎంతో అమాయకంగా నటించి ప్రేక్షకులు మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో పాటలు కూడా ఇప్పటికి అందరికీ ఫెవరెట్ అనే చెప్పవచ్చు. కాగా, ఈ సినిమాలో రాధిక కొడుకు పాత్రలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నడా.. ఆ సినిమాలో తన ముద్దు మాటాలతో ప్రేక్షకులను ముచ్చట తెప్పించేలా నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ‘కార్తీక్’.

Swathi muthyam child artist

ఈ చిన్నోడు స్వాతిముత్యం సినిమాలో రాధిక కొడుకుగా, కమల్ హాసన్ కు స్నేహితుడిగా  చాలా బాగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ చిన్నోడు పెరిగి పెద్దవాడు కూడా అయ్యాడు. మరీ ఆ సినిమాలో బాలనటుడిగా నటించిన కార్తీక్ ఎవరో కాదు.. స్వయనా జానపత చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిన నటుడు కాంతారావుకి మనవడు. ఇకపోతే కాంతరావు తన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఒకరు ఉండాలనే ఉద్దేశంతో.. తన మనవడు కార్తీక్ ను స్వాతిముత్యం సినిమాలో నటించేలా చేశాడు. కానీ, కార్తీక్ ఆ ఒక్క సినిమాలోనే తప్పా మరీ ఏ సినిమాలో నటించలేదు. పైగా చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఇండియాకు వచ్చిన కార్తీక్..  రమ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కాగా, ఇప్పుడు ఆయన బిజినెస్ రంగంలో రాణిస్తున్నాడు. అయితే ప్రస్తుతం కార్తిక్ పెళ్లినాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ, కార్తీక్ సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్, వివరాలు మాత్రం ఏమీ తెలియరాలేదు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetador girişgrandpashabet