iDreamPost
android-app
ios-app

OTTలోకి ఫ్యామిలీ మ్యాన్ హీరో మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?

  • Published Jul 27, 2024 | 3:00 AM Updated Updated Jul 27, 2024 | 3:00 AM

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న నటుడు మనోజ్ బాజ్ పేయ్. దీనికి కన్నా ముందే తెలుగు పలు సినిమాలతో అలరించాడు. ఈ ఏడాది కిల్లర్ సూప్ సిరీస్ తో మరోసారి మెప్పించాడు. ఈ వర్సటైల్ నటుడి తాజా చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న నటుడు మనోజ్ బాజ్ పేయ్. దీనికి కన్నా ముందే తెలుగు పలు సినిమాలతో అలరించాడు. ఈ ఏడాది కిల్లర్ సూప్ సిరీస్ తో మరోసారి మెప్పించాడు. ఈ వర్సటైల్ నటుడి తాజా చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.

  • Published Jul 27, 2024 | 3:00 AMUpdated Jul 27, 2024 | 3:00 AM
OTTలోకి ఫ్యామిలీ మ్యాన్ హీరో మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?

బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మనోజ్ బాజ్‌పాయ్. ఇటు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ వర్సటైల్ యాక్టర్ తెలుగు వారికి సుపరిచితమే. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ప్రేమ కథతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ యాక్టర్.. హ్యాపీ, కొమరం పులి, వేదం వంటి చిత్రాలు చేశాడు. కానీ అతడ్ని అందరికీ దగ్గర చేసిన వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మ్యాన్. అమెజాన్ ప్రైమ్ లో ఓ ఊపు ఊపేసిన సిరీస్ ఇది. ఆ తర్వాత సీక్వెల్ కూడా ఆకట్టుకుంది. ఫ్యామిలీ మెన్ 3 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారంటూ మేకర్స్‌ను అడుగుతున్నారు. ఓటీటీ హీరోగా ముఖ్యంగా వెబ్ సిరీస్‌ల కథానాయకుడిగా మారిన మనోజ్.. తాజాగా ఓ చిత్రంతో అలరించాడు. ఇది ఆయన వందవ సినిమా. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

మనోజ్ బాజ్ పేయ్ తాజాగా నటించిన చిత్రం భయ్యాజీ. మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఇది రివేంజ్ డ్రామా మూవీగా తెరకెక్కింది. ఇందులో పూర్తి డిఫరెంట్ అండ్ మాస్ యాంగిల్లో కనిపించాడు ఈ నటుడు. రామ్ చరణ్ త్రిపాఠి పాత్రలో మెప్పించాడు. సిర్ఫ్ ఏక్ బందా ఖపీ హై మూవీ తెరకెక్కించిన అపూర్వ సింగ్ కర్కి దీనికి దర్శకుడు. జోయా హుస్సేన్ హీరోయిన్. సువీందర్ విక్కీ నెగిటివ్ రోల్ పోషించాడు. జతిన్ స్వామి, విపిన్ శర్మ తదితరులు ఇతర పాత్రధారులు. భూషణ్ స్టూడియోస్ లిమిటెడ్, ఎస్ఎస్ఓ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ భనుశాలి, కమలేష్ భనుశాలి, మనోజ్ బాయ్ పేయ్, షబానా రజా (మనోజ్ భార్య), షాహేల్ తదితరులు నిర్మించారు.

మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత.. జులై నెలలో డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధం అయ్యింది. జులై 26 అంటే ఈ రోజు (శుక్రవారం) నుండే స్ట్రీమింగ్ అవుతుంది. ZEE5లో ప్రసారం అవుతుంది. అయితే ప్రస్తుతానికి హిందీ వర్షన్ మాత్రమే రాబోతుంది. ఈ మూవీని భారీ ధరకు దక్కించుకుంది జీ 5. మరీ తెలుగులో వస్తుందేమో చూడాలి. ఇక తెలుగు ఆడియన్స్ కోసం ఈ మూవీ తీసుకొస్తారో లేదో చూడాలి. ఇక ఈ ఏడాది కిల్లర్ సూపర్‌తో అలరించాడు మనోజ్ బాజ్ పాయ్. తెలంగాణలో జరిగిన మర్డర్ ఆధారంగా తీసిన వెబ్ సిరీస్. బాగా ఆకట్టుకుంది. ఇవి కాకుండా డిస్పాచ్, ద ఫేబుల్ వంటి చిత్రాలు చేస్తున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom