ఏదో ప్యాన్ ఇండియా సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నంత పబ్లిసిటీ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ కొత్త వెబ్ సిరీస్ సుడల్. భారీగా ప్రమోషన్ చేయడంతో పాటు అధిక భాషల్లో డబ్బింగ్ ఇవ్వడంతో ఎక్కువ శాతం ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. అయిదేళ్ల క్రితం తమిళంలో వచ్చి ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న విక్రమ్ వేద దర్శక ద్వయం పుష్కర్ గాయత్రిలు దీనికి రచన చేశారు.ఎనిమిది ఎపిసోడ్లకు బ్రహ్మ అనుచరణ్ లు జంటగా దర్శకత్వం వహించారు. ఐశ్వర్య రాజేష్ ప్రధాన […]
థియేటర్లలో ఎలాగూ కొత్త సినిమాలు వస్తుంటాయి కానీ ఇల్లు కదలకుండా కూర్చున్న చోటే కాలక్షేపం అయ్యే అవకాశం ఇస్తున్నవి ఓటిటిలే. 10వ తేదీన అంటే సుందరానికి, 777 ఛార్లీలతో పాటు ఇంకో రెండు చిన్న సినిమాలు హాల్లో అడుగుపెడుతున్నాయి. వాటికి ధీటుగా స్మాల్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ కూడా ముస్తాబవుతోంది. అవేంటో చూద్దాం. జీ5లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అందుకుంటున్న మూవీ ‘కిన్నెరసాని'(KINNERASANNI). మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన ఈ థ్రిల్లర్ జనవరిలో రావాల్సింది. కానీ […]
గత నెల విడుదలైన అజయ్ దేవగన్ కొత్త సినిమా రన్ వే 34 అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసింది. మరి ఇందులో నెటిజెన్లు ఫైర్ అవ్వడానికి ఏముందంటారా. దీనికి కూడా కెజిఎఫ్ 2 తరహాలో పే పర్ వ్యూ మోడల్ లో 199 రూపాయల ధర నిర్ణయించడంతో వాళ్ళు భగ్గుమంటున్నారు. డబ్బులు కట్టి చూడటం మొదలుపెట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే దీన్ని పూర్తి చేయాలనే నిబంధం వాళ్లకు మరింత చిరెత్తుకొచ్చేలా చేస్తోంది. ఈ మాత్రం దానికి సంవత్సరానికి […]
సినిమా తీయడం, హిట్టు కొట్టడం, కోట్ల రూపాయల వసూళ్లు చేసుకోవడం ఎంత కీలకమో దాన్ని పైరసీ బారిన పడకుండా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు కానీ పరిశ్రమ వర్గాలు కానీ దీనికి ఎలాంటి పరిష్కారం కనుక్కోలేకపోయాయి. వచ్చే మార్గం మారిందే తప్ప ప్రతి కొత్త మూవీ విడుదల కావడం ఆలస్యం సాయంత్రానికి దాని కెమెరా ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోంది. సరే ఇది ఎవరూ కట్టడి చెయ్యలేని వ్యవహారం సినిమా […]
తెలుగులో ఈ వారం థియేటర్లలో మూడు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి, శ్రీ విష్ణు భళా తందనాన, విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం, సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమాలు ఈ వారం ప్రేక్షకులని థియేటర్లలో అలరించనున్నాయి. ఇక ఇంట్లోనే ఉండి సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ చూడటానికి ఓటీటీలలో కూడా ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసి ఎంజాయ్ చేస్తూ […]
మహానటితో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కీర్తి సురేష్ కొత్త సినిమా చిన్ని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకోనుంది. తమిళంలో సాని కడియం టైటిల్ తో రూపొందిన ఈ రివెంజ్ డ్రామాకు అరుణ్ మహదేశ్వరన్ దర్శకుడు. విజయ్ బీస్ట్ లో కీలక పాత్రలో కనిపించిన కల్ట్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఇందులో ఓ ముఖ్య పాత్ర చేయడం విశేషం. లాక్ డౌన్ టైంలో దీని షూటింగ్ వేగంగా పూర్తి చేశారు. మిగిలిన పాత్రలు ఎవరు పోషించారనేది టీజర్ […]
దేశవ్యాప్తంగా సంచలనాత్మక వసూళ్లతో అదరగొడుతున్న కెజిఎఫ్ 2 ఓటిటి ప్రీమియర్ డేట్ ఆల్మోస్ట్ లాక్ అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మే 13న KGF Chapter 2, Amazon Prime Videoలో రావొచ్చనే లీక్ గట్టిగానే తిరుగుతోంది. ఇదెంత వరకు నిజమో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇక్కడ కొన్ని అంశాలు గమనించవవచ్చు. ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన డిజిటల్ డేట్ వచ్చే సమయానికి కెజిఎఫ్ 2 […]
దసరా సంబరాలు థియేటర్లలోనే కాదు ఓటిటిలోనూ మొదలయ్యాయి. జ్యోతిక 50వ సినిమాగా మంచి ప్రచారం దక్కించుకున్న రక్త సంబంధం ఓటిటి రిలీజ్ అఫీషియల్ గా ఈ రోజే అయినప్పటికీ నిన్న రాత్రి నుంచే అందుబాటులోకి వచ్చింది. దీనికి సూర్య నిర్మాత. శశికుమార్, సముతిరఖని ప్రధాన పాత్రల్లో సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలేమీ లేవు కానీ డిజిటల్ విడుదల కాబట్టి ట్రైలర్ చూశాక అంతో ఇంతో ఆసక్తి కలిగింది. అందులోనూ ఇటీవలి […]