iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా తెలుగు OTTలోకి శివకార్తికేయన్ అవార్డు విన్నింగ్ మూవీ ‘కురంగు పెడల్’

Kurangu Pedal Now Streaming In Telugu: ఓటీటీలో చాలానే అద్భుతమైన సినిమాలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం తెలుగులో అస్సలు అందుబాటులో ఉండవు. అయితే ఇప్పుడు ఒక అవార్డు విన్నింగ్ సినిమా మీకోసం తెలుగులోకి వచ్చేసింది.

Kurangu Pedal Now Streaming In Telugu: ఓటీటీలో చాలానే అద్భుతమైన సినిమాలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం తెలుగులో అస్సలు అందుబాటులో ఉండవు. అయితే ఇప్పుడు ఒక అవార్డు విన్నింగ్ సినిమా మీకోసం తెలుగులోకి వచ్చేసింది.

సైలెంట్ గా తెలుగు OTTలోకి శివకార్తికేయన్ అవార్డు విన్నింగ్ మూవీ ‘కురంగు పెడల్’

ఓటీటీలు వచ్చిన తర్వాత అందరూ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూసేస్తున్నారు. కొందరు అయితే తెలుగులో లేకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకుని మలయాళం, తమిళ్ చిత్రాలు చూసేస్తున్నారు. అయితే ఇప్పుడు నిర్మాతలే ఓటీటీలోకి వచ్చే సమయంలో ఇతర భాషల్లోకి కూడా డబ్ చేసి సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. తద్వారా కాస్త మంచి టాక్ వస్తే దానికి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాకుండా.. ఎక్కువ భాషల్లో వస్తే రైట్స్ ని కూడా కాస్త ఎక్కువ ధరలకు విక్రయించే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు అలాగే ఒక అవార్డు విన్నింగ్ మూవీ సైలెంట్ గా ఓటీటీలో తెలుగులోకి వచ్చేసింది. అది మరెవరి మూవీనో కాదు.. తమిళ్ హీరో శివకార్తికేయన్ చిత్రం.

శివకార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త కథలు, భిన్నమైన కథాంశాలతో శివకార్తికేయన్ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు. అయితే హీరోగానే కాకుండా.. అటు ప్రొడ్యూసర్ గా కూడా ఇలాంటి ప్రయోగాలే చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే శివకార్తికేయన్ పిల్లలతో ఒక చిత్రం నిర్మించాడు. అదే ‘కురంగు పెడల్’. ఈ మూవీ ఇప్పటికే రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అయితే ఇన్ని రోజులు తమిళ్ లో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు సైలెంట్ గా తెలుగులో కూడా ఈ చిత్రం వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కురంగు పెడలి చిత్రం తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ కూడా అవుతోంది.

కథ ఏంటి?:

ఈ చిత్రం 1980ల సమయంలో జరిగినట్లు చూపించారు. కొందరు చిన్న పిల్లలు ఉంటారు. వాళ్లు కలిసే చదువుకుంటారు, కలిసే అల్లరి చేస్తారు, కలిసే ఆటలు ఆడతారు. వాళ్లంతా చాలా టాలెంటెడ్ కూడా. అయితే వారిలో ఒకడికి సైకిల్ తొక్కడం రాదు. ఎలాగైనా సైకిల్ నేర్చుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ గ్యాంగ్ లో చాలామంది కంటే ఇతను పెద్దవాడు. అయినా సైకిల్ తొక్కలేడు. ఇదే సినిమాకి సోల్. దీని చుట్టూ చాలానే డ్రామాని చూపించారు. సైకిల్ నేర్చుకోవాలి అనే తపనలో ఎలాంటి పరిస్థితుతలను ఎదుర్కొన్నాడు అనేదే అసలు కథ. అలాగే సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మీరు మీ స్కూల్ రోజులకు వెళ్లిపోతారు. మీరు చిన్నప్పుడు చేసిన అల్లరి, ఆడిన ఆటలు గుర్తొస్తాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీకు ఈ కురంగు పెడల్ తెలుగులో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.