iDreamPost
android-app
ios-app

OTTలో అదిరిపోయే స్పై థ్రిల్లర్ ‘అవర్ కైండ్ ఆఫ్ ట్రైటర్’.. మిస్ అయ్యారా?

  • Published Aug 14, 2024 | 9:48 PM Updated Updated Aug 14, 2024 | 9:48 PM

OTT Suggestions- Best Spy Thriller Our Kind Of Traiter: ఓటీటీలో మీరు చాలానే స్పై థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక యాక్షన్ డ్రామా విత్ స్పై బ్యాగ్రాడ్ మాత్రం చూసుండరు. అసలు ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

OTT Suggestions- Best Spy Thriller Our Kind Of Traiter: ఓటీటీలో మీరు చాలానే స్పై థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక యాక్షన్ డ్రామా విత్ స్పై బ్యాగ్రాడ్ మాత్రం చూసుండరు. అసలు ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

  • Published Aug 14, 2024 | 9:48 PMUpdated Aug 14, 2024 | 9:48 PM
OTTలో అదిరిపోయే స్పై థ్రిల్లర్ ‘అవర్ కైండ్ ఆఫ్ ట్రైటర్’.. మిస్ అయ్యారా?

ఓటీటీలో మీరు ఏ జానర్ చూడాలి అని కాస్త సందిగ్ధంలో ఉంటే మీకోసం ఒక అదిరిపోయే సినిమా తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి మూవీ కాదు. ఇదో అదిరిపోయే స్పై థ్రిల్లర్. ఈ మూవీని స్టార్ట్ చేస్తే మాత్రం ఆపడం చాలా కష్టం. మీరు ఇప్పటి వరకు టామ్ క్రూజ్ చేసిన మిషన్ ఇంపాజిబుల్ లాంటి స్పై థ్రిల్లర్స్ ని చూసి ఉంటే ఆ రేంజ్ లో దీనిని ఊహించుకోవద్దు. ఇదంతా యాక్షన్ కంటే కూడా డ్రామా మీద ఎక్కువ నడుస్తూ ఉంటుంది. అలాగని తక్కువ అంచనా వేయడానికి లేదు. ట్విస్టులు, పతాక సన్నివేశాలతో పిచ్చెక్కించేస్తారు. మరి.. ఆ స్పై థ్రిల్లర్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న స్పై థ్రిల్లర్ హాలీవుడ్ నుంచి వచ్చిందే. ఇది చూడటానికి చాలా సాధారణ యాక్షన్ డ్రామాల ఉంటుంది. కానీ, కథ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కో క్యారెక్టర్, ఒక్కో ట్విస్టు రివీల్ అవుతూ ఉంటే మీకు ఫ్యూజులు అవుట్ అవుతూ ఉంటాయి. ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ లో ఇలాంటి డ్రామాని కూడా చూపించొచ్చా అనే భావన కలుగుతుంది. ఈ సినిమాలో ఒక కాలేజ్ ప్రొఫెసర్ ఉంటాడు. అలాగే ఒక రష్యన్ మాఫియా లీడర్ ఉంటాడు. వీళ్లద్దరి మధ్య అసలు కథ నడుస్తూ ఉంటుంది. స్పైగా ఉన్న ఈ ప్రొఫెసర్ తో రష్యన్ మాఫియా లీడర్ సంబంధం ఏర్పచుకుంటాడు. అతను ఎవరో తెలిసే కావాలని దగ్గరవుతాడు. అలాగే పార్టీకి పిలిచి ఒక డేంజర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాడు. ఆ సమాచారం చూసిన తర్వాత ప్రొఫెసర్ కి ఏం చేయాలే అర్థం కాదు.

రష్యన్ మాఫియా తరఫున నా బహుమతి అంటూ మనీ లాండరింగ్ కి సంబంధించి కీలక సమాచారాన్ని ఇస్తాడు. ఆ ప్రొఫెసర్ దానిని తమ ఏజెంట్స్ కి అందజేస్తాడు. అలా ఎందుకు తీసుకున్నావ్ అని ఇతనిపైనే తొలుత అనుమానం వస్తుంది. ఆ తర్వాత కథ పరుగులు పెడుతుంది. రష్యన్ మాఫియాకి చెందిన లీడర్ కు ప్రపంచంలో ఉన్న మిగిలిన మాఫియాల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. దాని నుంచి బయట పడేందుకు కొంత సమాచారాన్ని ఇవ్వాలి అనుకుంటాడు. అయితే అతనికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? అసలు ఈ ప్రొఫెసర్నే ఎందుకు ఎంచుకున్నాడు? అసలు వీళ్లిద్దరు బతికి బయటపడ్డారా? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం కావాలి అంటే మీరు ఈ “అవర్ కైండ్ ఆఫ్ ట్రైటర్” సినిమా చూడాల్సిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş