iDreamPost
android-app
ios-app

ఆగస్టు 15 సందర్భంగా.. OTTలో ఉన్న ఈ దేశభక్తి సినిమాలు చూసేయండి!

Independence Day 2024- Patriotic Movies To Watch On OTT: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ కుటుంబంతో కలిసి ఒక మంచి దేశభక్తి సినిమా చూడాలి అనుకుంటున్నారా? మీకోసం ఓటీటీలో అందుబాటులో ఉన్న ది బెస్ట్ దేశభక్తి సినిమాలు తీసుకొచ్చాం.

Independence Day 2024- Patriotic Movies To Watch On OTT: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ కుటుంబంతో కలిసి ఒక మంచి దేశభక్తి సినిమా చూడాలి అనుకుంటున్నారా? మీకోసం ఓటీటీలో అందుబాటులో ఉన్న ది బెస్ట్ దేశభక్తి సినిమాలు తీసుకొచ్చాం.

ఆగస్టు 15 సందర్భంగా.. OTTలో ఉన్న ఈ దేశభక్తి సినిమాలు చూసేయండి!

ఆగస్టు 15కు అందరూ పొద్దున్నే లేచి స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు ఇలా ఎవరికి ఎలా వీలు ఉంటే అలా జెండా వందనం చేసి ఇంటికి తిరిగి వస్తారు. పంద్రాగస్టు పబ్లిక్ హాలిడే కాబట్టి.. సరదాగా ఫ్యామిలీతో గడపుతారు. అలాంటి సమయంలో ఒక మంచి దేశభక్తి సినిమా చూస్తే ఎలా ఉంటుంది? ఆ ఫీల్ వేరుటుంది. దేశభక్తి చిత్రం అనగానే తెలుగు ప్రేక్షకులకు ‘ఖడ్గం’ చిత్రమే గుర్తొస్తుంది. అయితే ఆ మూవీ ఎలాగూ టీవీల్లో వస్తుంది. కాబట్టి మీరు ఈసారి కొత్తగా ఏమైనా దేశభక్తి సినిమాలు చూడాలి అనుకుంటే మాత్రం.. మీకోసమే ఈ ఆర్టికల్. ఇందులో ఓటీటీలు, యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న కొన్ని మంచి మంచి దేశభక్తి సినిమాలను తీసుకొచ్చాం. వాటిలో మీకు నచ్చిన ఒకటి లేదా రెండు సినిమాలను ఫ్యామిలీతో కలిసి చూసేసి ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని మరింత స్పెషల్ గా మార్చుకోండి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో:

సుభాష్ చంద్రబోస్ జీవితం, ఆయన పరాక్రమాలు, చేసిన త్యాగాలు ఆధారంగా ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో అనే సినిమాని తెరకెక్కించారు. ఇందులో ఆయన జీవితంలో ఉన్న కీలక ఘట్టాలను గుర్తుచేస్తూ.. అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా మీకు యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్:

భగత్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఈ సినిమాలో భగత్ సింగ్ బాల్యం నుంచి భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను ఉరితీయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల వరకు ఈ సినిమాలో చూపించారు. ఒక్కో సీన్ మీ కళ్లు చెమ్మగిల్లుతాయి. భగత్ సింగ్ గా అజయ్ దేవ్ గణ్ నటనకు మంత్రముగ్దులైపోతారు. ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. భగత్ సింగ్ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

శ్యామ్ బహద్దూరు:

ఈ మూవీ ఒక బయోపిక్. భారతదేశ తొలి ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మనేక్షా జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈయన దాదాపుగా 40 సంవత్సరాలు ఆర్మీలో సేవలందించడమే కాకుండా.. 5 యుద్ధాల్లో పాల్గొన్నారు. ఆ విషయాలను మొత్తం ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో శ్యామ బహద్దూర్ గా విక్కీ కౌశల్ నటించి మెప్పించాడు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

రాజీ:

అలియా భట్- విక్కీ కౌశల్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా ప్రతి సీన్ కి మీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఒక అమ్మాయి భారతదేశం కోసం పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కుటుంబంలో ఒక సభ్యురాలు అవుతుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పనిచేస్తుంది. ఈ పాత్రలో అలియా భట్ నటనకు మెస్మరైజ్ అయిపోతారు. ఈ రాజీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. రాజీ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

షేర్ షా:

షేర్ షా సినిమా కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్. ఆయన ఆర్మీలో ఎలా చేరారు? కెప్టెన్ గా ఎలా ఎదిగారు? భారత్ కార్గిల్ యుద్ధంలో గెలుపొదండంలో కీలకంగా ఎలా వ్యవహరించారు? అనే విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. విక్రమ్ బాత్రాగా సిద్ధార్థ్ మల్హోత్రా జీవించేశాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.