iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా OTT లోకి రీసెంట్ మలయాళీ మూవీ ‘లిటిల్ హార్ట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 13, 2024 | 11:32 AM Updated Updated Aug 13, 2024 | 11:53 AM

OTT Romantic Comedy Movie: మలయాళం నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. ప్రతి ఒక్క సినిమాను అసలు మిస్ కాకుండా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ ఎంట్రీ ఇచ్చేసిందే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Romantic Comedy Movie: మలయాళం నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. ప్రతి ఒక్క సినిమాను అసలు మిస్ కాకుండా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ ఎంట్రీ ఇచ్చేసిందే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Aug 13, 2024 | 11:32 AMUpdated Aug 13, 2024 | 11:53 AM
సైలెంట్ గా OTT లోకి రీసెంట్ మలయాళీ మూవీ ‘లిటిల్ హార్ట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

చాలా వరకు ఓటీటీ లోకి వచ్చే సినిమాలన్నీ కూడా.. వారం, పది రోజుల ముందుగానే స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటిస్తూ ఉంటాయి. దీనితో ప్రేక్షకులు కూడా ముందుగానే ఏ సినిమాను చూడాలి.. అని ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసి.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఇలా ప్రతి వారం ఎదో ఒక ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ వారం మరొక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా మరేదో కాదు.. మలయాళీ మూవీ ” లిటిల్ హార్ట్స్”. అదేంటో తెలియదు కానీ మలయాళం నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా.. అసలు మిస్ కాకుండా చూస్తుంటారు ప్రేక్షకులు.. ఆ సినిమాలలో ఉండే కంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది కాబట్టి .. జోనర్ తో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి సినిమా కూడా.. డీసెంట్ టాక్ ను సంపాదించుకుంటాయి. ఈ క్రమంలో జూన్ 7 న ‘లిటిల్ హార్ట్స్’ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ లాంటి వారు నటించారు . ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో ఆగష్టు 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఓ మంచి మలయాళీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చూడాలంటే ఈ సినిమా బెస్ట్ ఛాయస్.

ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా స్టోరీ అంతా కూడా.. మూడు ప్రేమ కథల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా నటించిన సీబీ, సోష ప్రేమ కథ.. వీరితో పాటు సీబీ తండ్రి ప్రేమ కథ, అలాగే సోషా తమ్ముడి ప్రేమ కథ. ఈ మూడు కథలలో వారు ఎదుర్కొని పరిస్థితులు.. అసలు వారి ప్రేమ కథ ఎక్కడి వరకు కొనసాగింది.. ఇలా అన్నిటిని ఎమోషనల్ , కామెడీ సీన్స్ తో చూపించారు. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ మూవీ 8.2 రేటింగ్ ను దక్కించుకుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా ఓటీటీ లో కేవలం మలయాళంలోనే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో తెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom