iDreamPost
android-app
ios-app

Raayan OTT: 2 ఓటీటీల్లోకి ధనుష్ రాయన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Aug 12, 2024 | 8:31 AM Updated Updated Aug 12, 2024 | 8:31 AM

Raayan OTT Release Date: ధనుష్ డైరెక్షన్ లో తనే హీరోగా వచ్చిన చిత్రం రాయన్. తాాజాగా దీని ఓటీటీ రిలీజ్ డేట్ మీద ఆసక్తికర వార్త వచ్చింది. ఆ వివరాలు..

Raayan OTT Release Date: ధనుష్ డైరెక్షన్ లో తనే హీరోగా వచ్చిన చిత్రం రాయన్. తాాజాగా దీని ఓటీటీ రిలీజ్ డేట్ మీద ఆసక్తికర వార్త వచ్చింది. ఆ వివరాలు..

  • Published Aug 12, 2024 | 8:31 AMUpdated Aug 12, 2024 | 8:31 AM
Raayan OTT: 2 ఓటీటీల్లోకి ధనుష్ రాయన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కెరీర్లో 50వ చిత్రంగా వచ్చిన మూవీ రాయన్. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించడమే కాక స్వయంగా దర్శకత్వం వహించాడు. పైగా ధనుష్ కెరీర్లో తెలుగులో ఎక్కువ థియేటర్లలో విడుదలైన చిత్రం కూడా రాయనే కావడం విశేషం. ఇక ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య జూలై 26న థియేటర్లలో విడుదలైన రాయన్ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరించారు.

అన్నదమ్ముల మధ్య అనుబంధం, ఫ్యామిలీ రివేంజ్ డ్రామా నేపథ్యంలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాయన్ సినిమాను తెరకెక్కించాడు ధనుష్. తెలుగులోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోలీవుడ్ లో రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. అక్కడ ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఇది ఇలా ఉండగా.. రాయన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్ ధనుష్ రాయన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నాయని టాక్.

Dhanush Rayan movie in 2 O TTs

ఈ నేపథ్యంలో ఆగస్టు 30 నుంచి ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇది అమెజాన్ కు సంబంధించి మాత్రమే. సన్ నెక్స్ట్ గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే రెండు ఓటీటీల్లో ఒకే రోజు నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దీని గురించి మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

రాయన్ కథేంటంటే..

త‌న కుటుంబ మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారిపై రాయ‌న్‌, అత‌డి సోద‌రులు ఎలా రివేంజ్ తీర్చుకున్నార‌న్న‌దే ఈ మూవీ క‌థ‌. ఈ సినిమాలో ధ‌నుష్‌, ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌రాం కాళిదాసుతో పాటు అప‌ర్ణ‌బాల‌ముర‌ళి న‌లుగురు నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్ క‌లిసి స్క్రీన్‌పై క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

ఇక ధనుష్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో కనిపించనుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది.