iDreamPost
android-app
ios-app

ఈ వారం OTTలోకి 15 మూవీలు.. ఆ ఒక్క సినిమాపైనే అందరి చూపు

  • Published Aug 26, 2024 | 11:10 AM Updated Updated Aug 26, 2024 | 11:10 AM

Weekend OTT Movies Release List: మరో వారం వచ్చేసింది.. మరి ఈ వీక్‌ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏవి.. వాటిల్లో ఏ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే..

Weekend OTT Movies Release List: మరో వారం వచ్చేసింది.. మరి ఈ వీక్‌ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏవి.. వాటిల్లో ఏ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే..

  • Published Aug 26, 2024 | 11:10 AMUpdated Aug 26, 2024 | 11:10 AM
ఈ వారం OTTలోకి 15 మూవీలు.. ఆ ఒక్క సినిమాపైనే అందరి చూపు

మరో వారం వచ్చేసింది. ఇక మూవీ లవర్స్‌ ఈ వీక్‌ ఓటీటీలోకి వచ్చే చిత్రాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వాటి లిస్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఒక్కసారి జాబితా రాగానే.. తమ ఫెవరేట్‌ సినిమాలు ఉన్నాయా లేదా చూసుకుంటారు. ఉంటే వాటి రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు.. ఏ ఓటీటీలోకి రాబోతుంది.. వంటి వివరాలను నోట్‌ చేసుకుని.. వీకెండ్‌ నాటికి ఓ లిస్ట్‌ ప్రిపేర్‌ చేసుకుంటారు. ఆ తర్వాత తీరిగ్గా శని, ఆదివారాల్లో తమకు నచ్చిన చిత్రాలను ఎంజాయ్‌ చేస్తుంటారు. మరి ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏవి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ మూవీ విడుదల కాబోతుంది అనే వివరాలు మీ కోసం..

ఓటీటీ సినిమాల సంగతి అలా ఉంచితే.. ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు భారీ చిత్రాలు పెద్దగా ఏం లేవు. నాని సరిపోదా శనివారం మినహా. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ మూవీతో పాటు ఒకట్రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటిపై పెద్దగా బజ్‌ లేదు. మరి ఏ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో తెలియాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాలి.

కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు బోలెడు ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. వీటిలో మన వారికి కాస్తో కూస్తో ఆసక్తి ఉన్న సినిమా.. అల్లు శిరీష్‌ నటించిన బడ్డీ. ఈ మూవీ ఆగస్టు 30 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు పలు బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలు, సిరీస్‌లు కూడా వస్తున్నాయి. మరి ఏయే ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్‌

  • బడ్డీ (తెలుగు సినిమా)- ఆగస్టు 30
  • ఐసీ 814: ది కాందహార్ హైజాక్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 29
  • కావోస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29
  • పోలైట్ సోసైటీ -(ఇంగ్లీష్ సినిమా)- ఆగస్టు 28
  • టర్మినేటర్ జీరో-(ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 29

జియో సినిమా

  • అబిగైల్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్టు 26
  • గాడ్జిల్లా ఎక్స్‌ కింగ్: ది న్యూ ఎంపైర్(ఇంగ్లీష్ సినిమా)- ఆగస్టు 29
  • క్యాడేట్స్‌ (హిందీ వెబ్ సిరీస్‌)- ఆగస్టు 30

జీ5

  • ఇంటరాగేషన్ (హిందీమూవీ)- ఆగస్టు 30
  • ముర్షిద్ (హిందీ సిరీస్)- ఆగస్టు 30
  • డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌
  • ఓన్లీ మర్డర్స్ ఇన్‌ ది బిల్డింగ్ సీజన్-4- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- ఆగస్టు 27
  • కానా కానుమ్ కాలంగల్‌ సీజన్-3- తమిళ వెబ్ సిరీస్- ఆగస్టు 30

అమెజాన్ ప్రైమ్

  • ది రింగ్స్‌ ఆఫ్ పవర్ సీజన్-2 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 29

లయన్స్‌ గేట్ ప్లే

  • హెన్రీస్ క్రైమ్ (ఇంగ్లీష్)- ఆగస్టు 30
  • ది సెప్రెంట్‌ క్వీన్‌ సీజన్-2 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 30