iDreamPost
android-app
ios-app

OTTలోకి సడెన్ గా తెలుగు క్రైమ్ కామెడీ మూవీ ‘నటరత్నాలు’! స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Nata Ratnalu Movie: ఓ టాలీవుడ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చింది. ఇందులో బిగ్ బాస్ బ్యూటీ ఒకరు నటించగా..మూడు నెలల క్రితం థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఓటీటీలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

Nata Ratnalu Movie: ఓ టాలీవుడ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చింది. ఇందులో బిగ్ బాస్ బ్యూటీ ఒకరు నటించగా..మూడు నెలల క్రితం థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఓటీటీలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

OTTలోకి సడెన్ గా తెలుగు క్రైమ్ కామెడీ మూవీ ‘నటరత్నాలు’! స్ట్రీమింగ్ ఎక్కడంటే..

నేటికాలంలో చాలా మంది ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలకి వెళ్లి చూస్తున్నప్పటికీ ఓటీటీలో సైతం వీక్షించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారం వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాకు సంబంధించిన సమాచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఇదే సమయంలో ఓటీటీలో వారం వారం అనేక  జోనర్ల సినిమాలు  రిలీజ్ అవుతాయి. తాజాగా ఓ టాలీవుడ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ  సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.  మరి.. ఆ మూవీ ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

నటరత్నాలు  అనే టాలీవుడ్ మూవీ మే 17న థియేటర్లలో రిలీజై2ది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్  సొంతం చేసుకుంది. క్రైమ్ కామెడీ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు మూడున్నర నెలల తరువాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అది కూడా సడెన్ స్ట్రీమింగ్ అవుతూ సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళవారం అనగా సెప్టెంబర్  13వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంగళవారం రిలీజైంది. అయితే ఈ మూవీ రెంటెడ్ బేస్ లో మాత్రం చూడగలరు. ఈ మూవీని చూడాలంటే రూ.99 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికీ సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి రాకుండా కేవలం రెంట్ చెల్లించిన వాళ్లకే రావడం గమనార్హం.

ఇక నటరత్నాలు సినిమా గురించి చూసినట్లు అయితే.. ఈ సినిమాను నర్ర శివనాగు డైరెక్ట్ చేశారు. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ ,తాగుబోతు రమేశ్, అర్చన లాంటి వాళ్లు కీలక పాత్రలో నటించారు. అనేక సినిమాలను తెరకెక్కించిన శివనాగు..ఈ సారి ఓ క్రైమ్ కామెడీ జోనర్ మూవీతో ప్రేక్షకులమ దుకు వచ్చాడు.  కథ విషయంలోకి వెళ్తే.. సినీ ఇండస్ట్రీలో ఏదో సాధించాలని ఆశలతో వెళ్లిన యువతి.. అక్కడికి వెళ్లిన తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నదే ఈ మూవీ కథ.

హీరో, డైరెక్టర్, కెమెరా మ్యాన్ అవ్వాలని ముగ్గురు యువకులు పడిన తపన చుట్టూ ఈ నటరత్నాలు స్టోరీ తిరుగుతుంది. ఈ ముగ్గురు యువకులకు సినిమా ఛాన్స్ దొరికిన సమయానికి అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అసలు వీళ్లు ఆ హత్యలో ఎలా ఇరుక్కుంటారు, వారికి ఆ హత్యకు ఏంటి సంబంధం?,  ఈ ముగ్గురు యువకులు హత్య కేసు నుంచి బయటపడతారా?, వీళ్ల సినిమా ఆశలు నిరవేరుతాయా? అనేది తెలియాలంటే.. నటరత్నాలు చూడాల్సిందే. ప్రస్తుతం రెంటెడ్ విధానంలో ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ సినిమా.. ఫ్రీగా ఎప్పుడు వస్తుందన్నది ఇంకా వెల్లడించలేదు.

jojobet girişjojobetmarsbahis girişmarsbahismarsbahis girişgamdom girişholiganbet girişjojobet giriş