iDreamPost
android-app
ios-app

OTT లో క్రేజీ కొరియన్ డ్రామా ‘మౌస్’ ను మిస్ కాకుండా చూడండి.

  • Published Aug 18, 2024 | 12:01 AM Updated Updated Aug 18, 2024 | 12:01 AM

OTT Best Suspense Thriller: ఈ సినిమాలో ఉండే సస్పెన్స్ ఎలిమెంట్స్ చూస్తే.. ఇది కదా సస్పెన్స్ సైకో కిల్లర్ డ్రామా అని ఫీల్ కచ్చితంగా కలుగుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

OTT Best Suspense Thriller: ఈ సినిమాలో ఉండే సస్పెన్స్ ఎలిమెంట్స్ చూస్తే.. ఇది కదా సస్పెన్స్ సైకో కిల్లర్ డ్రామా అని ఫీల్ కచ్చితంగా కలుగుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Aug 18, 2024 | 12:01 AMUpdated Aug 18, 2024 | 12:01 AM
OTT లో క్రేజీ కొరియన్ డ్రామా ‘మౌస్’ ను మిస్ కాకుండా చూడండి.

ఇప్పటివరకు ఎన్నో మర్డర్ మిస్టరీ , సైకో కిల్లర్ సినిమాలను చూసి ఉంటారు. ఇవన్నీ కూడా చివరి వరకు సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఎంగేజింగ్ గా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఈ సినిమా చూస్తే ఇది కదా సస్పెన్స్ డ్రామా అంటే అనే ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది. అందులోను ఇది కొరియన్ థ్రిల్లర్ సిరీస్ .. కాబట్టి సస్పెన్స్ ఎలిమెంట్స్ అంటే ఇష్టం ఉంటే మాత్రం ఈ సినిమాను అసలు చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి నైట్ టైమ్ ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటుంది. అక్కడ ఓ చిన్న పాప మా కార్ కు యాక్సిడెంట్ అయింది హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆ అమ్మాయి అక్కడకు వెళ్ళగానే ఆమెపై ఎవరో అట్టాక్ చేస్తారు. నెక్స్ట్ డే ఆ అమ్మాయి శవం బయట పడుతుంది.. తల దొరకదు, చేతి మీద ఏవో నెంబర్స్ ప్రింట్ అయ్యి ఉంటుంది. అప్పటివరకు అలాంటి మర్డర్స్ 18 జరుగుతాయి. పోలీసులు మాత్రం దీని గురించి ఎంత ఇన్వెస్టిగేట్ చేస్తున్నా కూడా హంతకుడిని మాత్రం పట్టుకోలేరు. పైగా ఆ హంతకుడికి హెడ్ హంటర్ అనే పేరు పెడతారు. పైగా ఈ కేసును సాల్వ్ చేసే పోలీస్ ఆఫీసర్ కొడుకు, కూతురిని కూడా ఆ హంటర్ కిడ్నప్ చేసి దారుణంగా చంపేస్తాడు.

కట్ చేస్తే ఈ కేసును సాల్వ్ చేయడానికి.. డానియల్ లీ అనే ఓ సైన్టిస్ట్ అమెరికా నుంచి కొరియాకు ఇన్వైట్ చేస్తుంది.. కొరియన్ గవర్నమెంట్. అతను మనుషుల డిఎన్ఏ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు . తల్లి కడుపులో బిడ్డ ఉన్నపుడే ఆ బిడ్డ నార్మల్ గా ఉన్నాడా.. లేదా సైకోపాత్ ఆ అని కనిపెడుతూ ఉంటాడు. ఒకవేళ బిడ్డ సైకోపాత్ అయితే.. బిడ్డ పుట్టకముందే అబార్షన్ చేయించేస్తారు. ఇక అతనికి అక్కడ హాన్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతని భార్య అప్పటికే ప్రెగ్నెంట్. ఇదిలా ఉండగా మరో వైపు ఆ హత్యలు జరుగుతూనే ఉంటాయి. దీనితో వెంటనే డానియల్ లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో హాన్ ఏ హెడ్ హంటర్ అని కన్ఫర్మ్ అవుతుంది. అసలు హాన్ ఎందుకు ఆ హత్యలు చేస్తాడు ? నిజంగా హాన్ ఈ హత్యలు చేశాడా ? హాన్ భార్యకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంటి ? ఆ తర్వాత డానియల్ లీ ఏం చేస్తాడు ? చివరికి కథ ఎలా ముగుస్తుంది ? ఇవన్నీ తెలియాలంటే “మౌస్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.