iDreamPost
android-app
ios-app

ఒక మహిళ మాఫియానే ఎదిరిస్తుంది.. OTTలో బెస్ట్ కొరియన్ డ్రామా ‘సిటిజెన్ ఆఫ్ కైండ్’!

  • Published Aug 13, 2024 | 10:35 AM Updated Updated Aug 13, 2024 | 10:35 AM

OTT Suggestions- Best Korean Drama- Citizen OF A Kind: మీకు కొరియన్ డ్రామాలు అంటే ఇష్టమా? అయితే మీరు ఈ మూవీ కచ్చితంగా చూడాల్సిందే. ఎందుకుంటే ఇది ఒక బెస్ట్ యాక్షన్ డ్రామా అనమాట.

OTT Suggestions- Best Korean Drama- Citizen OF A Kind: మీకు కొరియన్ డ్రామాలు అంటే ఇష్టమా? అయితే మీరు ఈ మూవీ కచ్చితంగా చూడాల్సిందే. ఎందుకుంటే ఇది ఒక బెస్ట్ యాక్షన్ డ్రామా అనమాట.

  • Published Aug 13, 2024 | 10:35 AMUpdated Aug 13, 2024 | 10:35 AM
ఒక మహిళ మాఫియానే ఎదిరిస్తుంది.. OTTలో బెస్ట్ కొరియన్ డ్రామా ‘సిటిజెన్ ఆఫ్ కైండ్’!

ఓటీటీలు వచ్చిన తర్వాత తన- మన బేధం లేకుండా అన్నీ సినిమాలను చూసేస్తున్నారు. ముఖ్యంగా కొరియన్ డ్రామాలకు అయితే పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో అయితే అది మరీ ఎక్కువ ఉంది. అమ్మాయిలు అయితే కొరియన్ సిరీస్లు చూస్తూ.. చూస్తూ కొరియన్ కూడా నేర్చేసుకుంటున్నారు. తెలుగులో ఉందా లేదా అని కూడా చూసుకోవడం లేదు. ఇంకా కొందరు అయితే సబ్ టైటిల్స్ కూడా లేకుండానే కొరియన్ డ్రామాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి ఒక కేటగిరీకి చెందిన వాళ్లే అయితే.. మీకోసం ఒక క్రేజీ డ్రామా తీసుకొచ్చాం. నిజానికి ఇది నిజంగా జరిగిన కథ అని చెబుతుంటారు.

కొరియన్ సినిమాలు అనగానే చాలామంది లవ్ స్టోరీలు అనేసుకుంటారు. కానీ, కొరియాలో చాలానే థ్రిల్లర్స్, యాక్షన్ డ్రామాలు, హారర్ థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. వాటిలో మీకోసం ఒక యాక్షన్ డ్రామాని సజీషన్ గా తీసుకొచ్చాం. ఈ మూవీ మొత్తం ఒక తల్లి చుట్టు తిరుగుతూ ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక బ్యాంకు లోన్ కోసం అప్లయ్ చేసి ఉంటుంది. అది వచ్చిన తర్వాత సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనేది ఆలోచన. అయితే ఆమె బ్యాంకు లోన్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలుసుకున్న కొందరు ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు. మనం ఎప్పుడూ చూసే విధంగానే ఆ అవసరం ఉంది.. ఈ అవసరం ఉంది.. బ్యాంక్ లోన్ అప్రూవ్ చేయిస్తాం అని ఆమె దగ్గర డబ్బులు గుంజేస్తారు.

ఆఖరికి తాను డబ్బులు కట్టింది లోన్ కి సంబంధించిన వాళ్లకి కాదని. ఇలా ఫ్రాడ్ చేసే ఒక పెద్ద మాఫియా ఉందని తెలుసుకుంటుంది. ఆమె సర్వం కోల్పోతుంది. పిల్లలు కూడా సంరక్షణ నిలయానికి వెళ్లిపోతారు. అయితే ఆమెకు ఇందులో ఒక లీడ్ దొరుకుతుంది. ఎలాగైనా ఆ బాస్ ఎవడు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? దీని వెనుక ఉన్న వాళ్లని బయటకు లాగాలి అని ఫిక్స్ అవుతుంది. అందుకోసం ఆమె ఏకంగా చైనాకి వెళ్తుంది. తనతో పనిచేసే ఇద్దరు మహిళల సాయంతో ఒక పెద్ద సహసానికి నడుంబిగిస్తుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి? ఆమె నిజంగానే ఆ ఫ్రాడ్ మాఫియాని బయటకు లాగిందా? అసలు ఆమెకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుందా? అనే విషయాలు తెలియాలి అంటే మీరు ఈ “సిటిజెన్ ఆఫ్ కైండ్” మూవీ చూడాల్సిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడచ్చు. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss